అవకాశాలు తగ్గిపోయాయి.. అందులోనూ సక్సెస్ లుకూడా లేవని ఫిక్స్ అయిపోయారు టాలీవుడ్ లో కొంతమంది.కానీ తనలో ఇంకా ఆ మ్యూజిక్ పవర్ ఉందని దాంతో మ్యాజిక్ చెయ్యగలనని ప్రూవ్ చేశాడు మణిశర్మ. ఒక్క సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన మణి.. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

 

సీనియర్స్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పనైపోయిందనుకున్నారు చాలా మంది. అంతేకాదు .. ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు అప్ డేట్ అవ్వలేదనుకున్నారు ఇంకొంతమంది. కానీ ఇస్మార్ట్ శంకర్ తో అదిరపోయే మ్యూజిక్ ఇచ్చాడు  ఈ సుస్వరబ్రహ్మ మణిశర్మ. ఈ సినిమా దెబ్బతో తన మ్యాజిక్ ని మళ్లొకసారి రిపీట్ చేశాడు మణి. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో మళ్లీ స్టార్ హీరోల సినిమాలు లైన్ కట్టాయి. ప్రజెంట్ కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఆచార్య సినిమాకు మాంచి మ్యూజిక్ సెట్ చేసుకుంటున్నాడు మణిశర్మ. చిరంజీవికి ఇప్పటి వరకూ అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణి..కాస్త గ్యాప్ ఇచ్చినా  మళ్లీ అదే రేంజ్ లో మెగాస్టార్ కి ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట.
 
సీనియర్ హీరో మెగాస్టార్ సినిమాతో పాటు .. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాకు కూడా సంగీతం ఇస్తున్నాడు మణిశర్మ. పూరీ జగన్ డైరెక్షన్లో  కరణ్ జోహార్, పూరీకనెక్ట్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మే. పూరీ సినిమాలకు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన మణి.. ఈ సినిమాకు అదిరిపోయే పాటలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు.

 

ఆచార్య, ఫైటర్ సినిమాలతో పాటు ఇప్పుడు మరో సినిమా పవర్ పేట కు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చెయ్యబోతున్నాడట మణి.  క్రుష్‌ణ చైతన్య  డైరెక్షన్లో నితిన్ 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు సంగీతం ఇవ్వమని ఆల్రెడీ యూనిట్ అప్రోచ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మణి. అంతకుముందు నితిన్మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్  పాటలు అభిమానులకు ఆకట్టుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: