దగ్గుబాటి వెంకటేష్, రితికా సింగ్ ప్రధాన పాత్రలలో నటించిన గురు సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. సుధా కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇరుది సుత్రు అనే తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో ఇరుది సుత్రు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో ఆ సమయంలోనే హిందీలో కూడా సాలా కడూస్‌ అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మూవీలో ఆర్ మాధవన్ బాక్సింగ్ కోచ్ పాత్రలో నటించగా... నూతన నటీమణి రితికా సింగ్ అతడి స్టూడెంట్ పాత్రలో నటించింది. ఈ చిత్రానికి సంగీత బాణీలు అందించిన సంతోష్ నారాయణ్ తన సత్తా చూపాడు అని చెప్పుకోవచ్చు.


తెలుగులో వచ్చిన గురు సినిమాలో ఆది(వెంకటేష్)కి బాక్సింగ్ అంటే చచ్చేంత ప్రాణం. తాను చాలా మంచి బాక్సర్ కూడా. ఆవేశం దూకుడుతనం ఉన్న ఇతడిని బాక్సింగ్ అకాడెమీ ప్రెసిడెంట్ ఒలంపిక్స్ కాంపిటేషన్ లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వరు. దాంతో ఒలంపిక్ లో గోల్డ్ మెడల్ సాధించాలనే తన ఆశయం అలాగే మిగిలిపోతుంది. అయితే తన ఆశయం ఎలాగో నెరవేరలేదని... తన స్టూడెంట్స్ ద్వారా అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని ఉంటాడు.


పట్టుదల ప్రతిభ ఉన్న బాక్సింగ్ విద్యార్థుల కోసం వెతుకుతున్న క్రమంలో అతనికి మురికివాడల్లో జీవనం కొనసాగించే కూరగాయల వ్యాపారి అయిన రామలక్ష్మి అలియాస్ రాముడు (రితికా సింగ్) తారసపడుతుంది. రామలక్ష్మి చెల్లి బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు కూడా బాక్సింగ్ నేర్పించాలని ఆది అనుకుంటాడు. ఆపై ఆమెకు డబ్బులిచ్చి మరీ కోచింగ్ నేర్పిస్తాడు. ఆ విధంగా రామలక్ష్మి అలియాస్ రాముడు బాక్సింగ్ బాగా నేర్చుకుని ఒలంపిక్స్ లో మెడల్ సాధిస్తుంది. సినిమా అనేది స్ట్రెయిట్ కథతో కొనసాగినప్పటికీ... సినిమా మొత్తంలో ఎన్నో భావోద్వేగాలు, మోటివేషనల్ సన్నివేశాలు, అక్కడక్కడ హాస్యభరితమైన సీన్స్ అన్ని కలిపి ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కల్పిస్తుంది. క్రీడారంగంలో సతమతమవుతున్న వారు ఎవరైనా ఈ సినిమా చూడటం ఒక పెద్ద ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: