పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిన గోపాల గోపాల చిత్రం లో తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ ఊహించని విభిన్నమైన కథ చూపించబడింది. ఈ సినిమాలో నాస్తికుడైన గోపాలరావు పాత్రలో నటించిన విక్టరీ వెంకటేష్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గోపాల్ రావు మాయమాటలు చెప్పే దేవుడి విగ్రహాలను అమ్మి బాగా డబ్బులు సంపాదిస్తాడు. దేవుడి విగ్రహాలను అమ్మి బతుకుతాడు కానీ దేవుడి పై అతనికి ఏమాత్రం నమ్మకం ఉండదు.


ఒకానొక రోజు దేవుడి వల్ల ఏ పని చేతకాదు అని, పూజలు పునస్కారాలు చేయడం వృథా అని విమర్శలు చేస్తాడు. మరుసటి రోజే భూకంపం వలన తన దేవుడి విగ్రహాల దుకాణం ఒక్కటే నేలమట్టం అవుతుంది. దాంతో 80లక్షల రూపాయలను ఆర్థికంగా నష్టపోతాడు. తన షాపుకి రావాల్సిన ఇన్సూరెన్స్ కోసం వెళితే ఇన్సూరెన్స్ సంస్థ భీమా కట్టేందుకు నిరాకరిస్తుంది. ఎందుకు అని అడిగితే భూకంపం అనేది దేవుడు చర్య గా తాము పరిగణిస్తామని... దేవుడి చర్య వలన కలిగిన నష్టానికి బీమా కవర్ అవ్వదు అని చెప్తారు.


దాంతో చిర్రెత్తుకొచ్చిన గోపాలరావు దేవుడి కారణంగానే తన షాపు నేలమట్టమయ్యిందని ఆ నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టులో కేసు వేస్తాడు. అలాగే దేవాలయాలకు, దేవుడు మిషన్లు నడిస్తే సంస్థలకు, ఇంకా తదితర వాటికి సమన్లు పంపిస్తాడు. మరోవైపు గోపాల్ రావు వాదనలో న్యాయం ఉందని భావించిన కోర్టు అతని కేసు టేకప్ చేస్తోంది. గోపాల్ రావు దేవుడిపై చేసే వాదనలు భక్తులెవరికి నచ్చదు. దాంతో అతని ని చంపాలని వారందరూ ప్రయత్నిస్తుంటారు.


ఈ క్రమంలోనే మనిషి రూపంలో సాక్షాత్తు ఆ భగవంతుడే నేలకు దిగి వచ్చి గోపాల్ రావు ని కాపాడి దిశానిర్దేశం చేస్తాడు. అయితే ఇటువంటి కథ తెలుగులో స్ట్రైట్ గా ఎవరైనా చేస్తారా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం నో అనే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన తెలుగు పరిశ్రమలో స్ట్రైట్ గా భిన్నమైన కథలు అసలు రావడం లేదు. కమర్షియల్ సినిమాలు తీసి డబ్బులు దన్నుకోవడం తప్ప ప్రజల్లో ఆలోచన రేకెత్తించే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. గోపాల గోపాల సినిమా కూడా హిందీ మూవీ అయిన ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్. ఒరిజినల్ మూవీ లో అక్షయ్ కుమార్, మిధున్ చక్రవర్తి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: