అసలు పెళ్లి ఊసే ఎత్తొద్దు అంటూ.. ఈ కాన్సెప్ట్ మీద ఏకంగా సినిమా చేస్తున్న సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు మాత్రం మాట మార్చేశాడు సాయిధరమ్ తేజ్ .. మెగా మేనల్లుడిగా సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చినా .. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వరుస ఫ్లాపుల్లో  ఉన్నా.. సక్సెస్ కోసం వెయిట్ చేసి చిత్రలహరితో మంచి హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత ప్రతిరోజూ పండగే లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేశాడు .  ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటరూ అంటూ ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు.

 

సోలో బ్రతుకు సో బెటరూ సినిమాలో.. ప్రేమా , పెళ్లి ఏం వద్దు.. సింగిల్  గా ఉండడటమే బెస్ట్ అంటూ తన ఫ్యాన్స్ కి చెబుతున్నాడు సాయిధరమ్ తేజ్. బట్ రియల్ లైఫ్ లో మాత్రం పెళ్లి చేస్కోవాలి తప్పదు అంటున్నాడు . ఇప్పటికే 33 ఏళ్లొచ్చేశాయి.. ఇంకా పెళ్లొద్దంటూ ఇంట్లో వాళ్లని తప్పించుకుని తిరగడం కష్టం. ఈ ఏజ్ దాటితే ఇక పిల్లను కూడా ఎవరూ ఇచ్చేలా లేరు. అందుకే పెళ్లికి రెడీ అవుతున్నా అంటున్నాడు . అంతేకాదు  మ్యాగ్జిమమ్ ఈ సంవత్సరమే నా పెళ్లి జరగొచ్చు అంటూ హింట్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్.

 

ఒక పక్క పెళ్లొద్దన్న హీరో పెళ్లి చేసుకుంటుంటే.. లవ్ మ్యారేజా.. ఎరేంజ్డ్ మ్యారేజా..? ఏ పెళ్లి చేసుకుంటావని సాయి పల్లవిని అడిగితే ఫ్యాన్స్ కి దిమ్మతిరిగి పోయే ఆన్సరిచ్చింది. .  హీరోయిన్ సాయిపల్లవి కూడా తన  పెళ్లి విషయం తేల్చేసింది. సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ కి మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ గా మారిపోయింది మళయాళ భామ సాయిపల్లవి. ఈ హీరోయిన్ సింపుల్ యాక్టింగ్ కి పర్ ఫామెన్స్ కి  ఫిదా అవ్వని వాళ్లెవరూ ఉండరు. సాయిపల్లవి ఇప్పటివరకూ చేసిన సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.. అటు డాక్టర్ గా, ఇటు యాక్టర్ గా తన హవా నడిపిస్తోంది.

 

కెరీర్ బానే ఉంది.. మరి పెళ్లి సంగతేంటి..? ప్రేమ పెళ్లా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా అని  అభిమానులు అడిగితే .. అబ్బే ..అసలు ఆ ఉద్దేశ్యమే లేదంటోంది. ఫిదా సినిమాలో తన తండ్రిని వదిలి వెళ్లను..అసలు పెళ్లి చేసుకోను అన్న సాయిపల్లవి రియల్ లైఫ్ లో కూడా ఇలానే అంటోంది. నేను పెళ్లి చేసుకోను.. మా అమ్మ, నాన్నల్ని చూసుకుంటూ వాళ్లదగ్గరే ఉంటాను అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది సాయిపల్లవి. మరి ఫ్యాన్స్ ఎంత హర్టయ్యారో పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: