రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్ళీ రాకూడదని అనుకున్నాడు. కానీ అభిమానుల కోరికో లేకో మరే కారణమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వచ్చే ఎలక్షన్స్ లోపు సినిమాలు చేసేసి అటువైపు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు. బాలీవుడ్ పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరో పదిరోజుల పాటు షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది.

 

అయితే ఇదే కాకుండ మరో రెండు ప్రాజెక్టులని లైన్లో పెట్టాడు. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా ఒకటి కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, క్రిష్ సినిమా కొద్దిపాటి షూటింగ్ కూడా జరుపుకుంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటోంది. 

 


పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా మరో సినిమాని కూడా లైన్లో పెడుతున్నట్టు టాక్. మళయాలంలో సూపర్ హిట్ సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనే చిత్రాన్ని రీమేక్ చేయాలని చూస్తున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. నిర్మాతకి ఈ సినిమా బాగా నచ్చిందట. 

 

పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే అధికారిక సమాచారం వెలువడనుంది. అయితే పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారని వినబడుతుంది. పవన్ కళ్యాణ్ అయితే ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడన్న ఉద్దేశ్యంతో మళయాల రీమేక్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ చర్చలు జరుగుతున్నాయని వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: