తెలుగు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని క‌థ‌కి ప్రాధాన్య‌మిస్తే మరికొన్ని కథనం, అలాగే కమర్షియల్ అంశాలతో హిట్ కొడుతున్నాయి. అలాగే సినిమా హిట్ అయినంత మాత్రానా అందులోని పాట‌లు హిట్ అవ్వాల‌ని రూల్ లేదు. అయితే మ‌రికొన్ని సినిమాలు క‌థ ప‌రంగా హిట్ అయినా లేక‌పో‌యిన అందులోని పాట‌లు మాత్రం సూప‌ర్ హిట్ అయిన ఎన్నో చిత్రాలున్నాయి. ‌ఇక సంగీతం పరంగా, అలాగే క‌థ కూడా సూపర్ హిట్ అయిన చిత్రాలు కాస్త తక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో ‘నువ్వు వస్తావని’ సినిమా ముందు వరుసలో ఉంటుంద‌ని చెప్పాలి. అక్కినేని నాగార్జున, సిమ్రన్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలో ప్రతి పాట కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ప్ర‌తీ సీన్ మంచి ఎమోష‌న‌ల్ ల‌వ్‌డ్రామాగా తెర‌కెక్కింది.

నాగార్జున, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నువ్వు వస్తావని’ చిత్రం 2000 ఏప్రిల్ 5న విడుదలైంది. వి.ఆర్. ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి నిర్మించారు. ఎస్.ఎ.రాజ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కలలోనైనా కలగనలేదు నువ్వు వస్తావని..’, ‘పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి..’, ‘మేఘమై నేను వచ్చాను..’, ‘కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది..’, ‘రైలు బండిని నడిపేది..’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అప్ప‌ట్లో ఏ ఆటోలో చూసినా.. ఏ షాపులో అయినా అలాగే టీవీలో ఎక్కువ‌గా ఈ పాట‌లే వినిపించేవి. 

అయితే నిజానికి ఇది రీమేక్ మూవీ. ఇక నాగార్జున ఏదైనా ఎక్స్‌పిరిమెంట్లు చేయ‌డంలో ముందుంటారు. ‌తమిళంలో 1999లో విడుదలైన ‘తుల్లద మనముం తుల్లం’ అనే సినిమాను తెలుగులో ‘నువ్వు వస్తావని’ పేరిట రీమేక్ చేశారు. తమిళంలో విజయ్, సిమ్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం తెలుగులో కూడా మంచి హిట్ ని సాధించింది. ఇక ఇందులో అన్ని సీన్లు చాలా బావుంటాయి. కేవ‌లం ఒక్క నాగార్జున త‌ల్లి చ‌నిపోయే సీన్‌లో కాస్త స‌రిగా చేయ‌లేద‌ని అప్ప‌ట్లో కొన్ని వ‌దంతులొచ్చిన‌ప్ప‌టికీ సినిమా మాత్రం సూప‌ర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: