మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నాడు. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ కంచె సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఫిదా సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత తొలిప్రేమతో హిట్ అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో తన నటనతో మెప్పించాడు వరుణ్ తేజ్. 


తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండా రీమేక్ గా వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమాకు రిలీజ్ ముందురోజు వరకు వాల్మీకి టైటిల్ అనుకున్నారు. కానీ సినిమా టైటిల్ పై కొందరు గొడవచేయడం వల్ల సినిమా రేపు రిలీజ్ అనగా టైటిల్ మార్చేశారు. చివరి నిమిషంలో టైటిల్ మార్చుకున్నా సరే గద్దలకొండ గణేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. తమిళంలో బాబీ సింహా నటించిన ఈ పాత్రని తెలుగులో వరుణ్ తేజ్ చేశారు. 


అక్కడ సిద్ధార్థ్ నటించిన ఆ పాత్రని తెలుగులో అధర్వ మురళి చేశారు. సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, మృణాళిని నటించారు. వరుణ్ తేజ్ కెరియర్ లో గద్దలకొండ గణేష్ మంచి సినిమాగా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యాడు వరుణ్ తేజ్. తమిళంలో హిట్టైన సినిమాలు తెలుగులో రీమేక్ అవడం కామనే. కానీ జిగర్తాండా విషయంలో వరుణ్ తేజ్ కోసం కొద్దిగా కథలో మార్పులు చేశారు.  గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ తన నటనతో అందరిని మెప్పించాడు, సినిమాలో నెగటివ్ రోల్ లా అనిపించే పాత్ర చేసి మెప్పించిన వరుణ్ తేజ్ తాను హీరోగానే కాదు ఎలాంటి పాత్రకైనా సూట్ అవుతాడని ప్రూవ్ చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: