మన తెలుగులో అయినా అటు తమిళంలో అయినా సరే ఇప్పుడు కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది. మహానటి సినిమా తర్వాత ఆమెకు వచ్చిన ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె సినిమాల కోసం ఎదురు చూసే పరిస్థితి కూడా ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. తెలుగులో వచ్చిన మహా నటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమెను అందరూ మహా నటి అని కీర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా ఛాన్సులు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. ఇది పక్కన పెడితే ఇటీవల ఆమెను ఒక స్టార్ హీరో సినిమా కోసం దర్శకుడు ఒకరు అడిగారట. స్కిన్ షో చెయ్యాలి అని ఒక హాట్ సాంగ్ కూడా ఉంటుంది అని ఆమెకు చెప్పారట. దీనితో ఆమె ఒక్కసారిగా సదరు దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. తనకు సినిమాలు ఎప్పుడూ అవసరం కాదని తాను డబ్బులు కోసం సినిమాలు చేయడం లేదని దయచేసి తనను అనవసరంగా కొన్ని కోణాల్లో చూడవద్దు అని ఆమె విజ్ఞప్తి చేసిందట.
అలాగే తనకు ఆఫర్లు ఇవ్వాలి అంటే నటన చూడాలి గాని మరో కోణం తనకు ఆవసరం లేదని తాను ఏ రోజు కూడా అవకాశాల కోసం ఎవరి చుట్టూ కూడా తిరిగిన సందర్భం అనేది లేదని దయచేసి తనను వదిలేసి వేరే వాళ్ళను చూసుకోవాలని సూచించింది కీర్తి. ప్రస్తుతం మన తెలుగులో కీర్తి రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేవలం నటనా పరమైన కోణంలో నే కీర్తి సురేష్ ఎప్పుడూ హైలెట్ అవుతూ వస్తోంది. ఆమె ముందు నుంచి స్కిన్ షో లాంటి విషయాలపై ఎప్పుడూ ఫోకస్ పెట్టి హైలెట్ అవ్వాలని చూడలేదు. అందుకే సదరు దర్శకుడికి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందన్న వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.