టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. ఇంకా చెప్పాలంటే అటు అనుష్క తో పాటు న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్ల‌తో పోటీ త‌ట్టుకుని తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో అంద‌రు అగ్ర హీరోల‌తో న‌టించిన ఆమె బాలీవుడ్‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుని విఫ‌ల‌మైంది. ఇక తెలుగులో ఆమె ఎన్టీఆర్ మహేష్ బాబు సహా అందరు స్టార్ హీరోలతో ఆమె ఆడి పాడటం మనం చూసాం. ప్రభాస్ తో రెండు సినిమాలు చేసింది ఆమె. అయితే ఇప్పుడు ఆమెను పక్కన పెట్టిన టాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ ఆమె వంట పడుతుంది అని అంటున్నారు. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారట.

 

ప్ర‌స్తుతం ఉన్న ముదురు హీరోల ప‌క్క‌న నటించేందుకు హీరోయిన్లు సెట్ కాక‌పోవ‌డంతో వాళ్ల‌కు కూడా ఆమే గ‌తి అవుతోంది. ఈ తరుణంలో పాప ఒక ఆఫర్ ఇచ్చింది దర్శక నిర్మాతలకు అని వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అంటే నేను బికినీ వేయడానికి రెడీ గా ఉన్నా అని చెప్పింది అని సమాచారం. తనకు అవకాశం ఇవ్వాలే గాని తాను బికినీ లో నటించడానికి సిద్దంగా ఉన్నా అని అలాగే ఎలాంటి డ్రెస్ అయినా వేసుకుని సినిమా చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తనకు అవకాశం ఇవ్వమని కొందరిని కోరింది.

 

పారితోషికం కూడా తనకు ఎక్కువగా అవసరం లేదని, తనకు ఇచ్చింది చాలు అన్నట్టు మాట్లాడుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు ఎవరు అవకాశం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు సినిమాలో ఒక బీచ్ సాంగ్ లో ఆమెను తీసుకుంటున్నారు అని తెలిసింది. ఐటెం సాంగ్స్ అయినా సరే తాను ఇప్పుడు చేయడానికి సిద్దంగా ఉన్నా అని ఆమె చెప్పినట్టు సమాచారం. గతంలో ఆమె కొన్ని ఐటెం సాంగ్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: