సినీ పరిశ్రమంలో ఛాన్స్ రావడం అంటే అంత సామాన్య విషయం కాదు.  ఎంతో కష్టపడాలి.. అందం ఉండాలి..దానికి తగ్గ నటన, హావభావాలు పలకాలి. ఇవన్నీ ఉన్నా ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ కావాలి.. కాకుంటే అదృష్టం అయినా కలిసి రావాలి. చాలా వరకు సినీ పరిశ్రమలో వారసత్వపు నటులే ఎక్కువ వస్తున్న సమయంలో స్వయంకృషితో ఎన్నో కష్టాలు పడుతూ మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకునే వారు కొంత మంది ఉన్నారు.  అలాంటి నటుల్లో ఆదర్శ్ బాలకృష్ణ ఒకరు.  చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ యువ నటుడు ‘బిగ్ బాస్’ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. మా టివిలో ఎన్టీఆర్ హూస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో చివరిదాకా గట్టి పోటీ ఇచ్చాడు.. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 1 శివబాలాజీ విన్నర్ గా నిలిచాడు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదర్శ్ బాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని. కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు, అవమానాలు పొందానని అన్నారు.  కృష్ణవంశీ దర్శకత్వంలో నేను 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేశాను. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం రావడాన్ని ఆర్టిస్టులు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది ఆయన సినిమాలో నటించినన్ని రోజులు నేను తిట్లు తింటూనే వచ్చాను. కొన్ని సీన్లలో నన్ను అందరి ముందు గట్టిగా తిట్టేవారు..  తర్వాత నువు ఎలా నటిస్తున్నావు నీకు అసలు నటన వచ్చా అని సీరియస్ అయ్యేవారు.

 

అలా ఆయన అంటున్న సమయంలో నాకు బాగా కసి పెరిగి.. బాగా నటించడానికి తెగ కష్టపడేవాన్ని అందుకే రిజల్ట్ కూడా బాగా వచ్చిందని అన్నారు.  అయితే అలా తిట్టడం నా మంచికే అయ్యిందని అన్నారు. ఇప్పుడు కృష్ణవంశి గారు ఎంతో స్నేహంగా మాట్లాడుతారు.. ఆయన నన్ను తిట్టిన తిట్లను నేను గుర్తుచేస్తుంటే, నాతో పాటు కలిసి ఆయన నవ్వుతుంటారు  అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: