టాలీవుడ్  లో దేవదాసు సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు రామ్ పోతినేని.  మొదటి సినిమాతోనే తన ఎనర్జీ ఏంటో చూపించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్..ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించాడు. ‘నేను శైలజ’ సినిమాతో మంచి విజయం అందుకున్నరామ్ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ అయ్యాయి. దాంతో మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరోకి పూరి జగన్నాథ్ తోడయ్యాడు.  అప్పటికీ పూరి కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, డైరెక్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ. స్రవంతి రవికిశోర్ నిర్మాత.

 


త‌మిళ మూవీ ‘త‌డం’కు ఇది రీమేక్‌.  నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఏప్రిల్  9వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే ఈ లోగా కరోనా వైరస్ విజృంభించడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఇక  లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటం జరిగిపోయింది.  ఈ మూవీపై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఈ మూవీ రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

 

ఇప్పటి వరకు రామ్ కెరీర్ లో ద్విపాత్రాభినయంలో నటించలేదు.. మొదటి సారిగా ఈ మూవీలో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడ. ఓ పాత్ర మాస్ లుక్ అయితే.. మరోపాత్ర క్లాక్ లుక్ లా కనిపిస్తుంది. ఇంతకుముందు రామ్ నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వంటి మాస్ హిట్ రావడంతో, సహజంగానే 'రెడ్' పై భారీ అంచనాలు వున్నాయి.  రామ్ -  కిషోర్ తిరుమల కాంబినేషన్లో మరో హిట్ పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: