ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అనిపించే వార్త ఇది. ఎందుకంటే సినిమాల్లో బొమ్మలు ఆడి శ‌త దినోత్సవం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బొమ్మ పడకుండా వంద రోజులు పై దాటిన అరుదైన ఘటన మాత్రం లాక్ డౌన్ పుణ్యమేనని అంటున్నారు. దాంతో వెండి తెర మీద ఇప్పట్లో బొమ్మ పడుతుందా అని సినీ అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఈ నేపధ్యంలో సినీవర్గాల నుంచి ఒక వార్త ప్రచారంలో ఉంది. అదేంటి అంటే జూలైలో వెండి తెర మీద బొమ్మ పడుతుంది అని. జూలై నాటికి లాక్ డౌన్ సడలింపులు పూర్తిగా ఇచ్చేస్తారని, దాంతో సినిమాలు ఆడించడానికి కూడా పర్మిషన్ ఇస్తారని అంటున్నారు. ఇక సినిమా హాళ్ళలో సామాజిక దూరం పాటించేలా ఒకటి రెండు సీట్లు వదిలేసి టికెట్లు సేల్స్ చేస్తారట. అలాగే శానిటైజ్ ఎప్పటికప్పడు చేయడం. పరిసరాల్లో శుభ్రతను పాటించడం కూడా చేస్తారట.

 

మొత్తానికి టికెట్లు తెగే రోజులు తొందరలో ఉన్నాయని అటు సినిమా నిర్మాతలు కూడా సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా సినిమా హాళ్ళు తెరచిన కూడా పెద్ద బొమ్మలు రావడానికి మాత్రం కొంతకాలం పడుతుంది అంటున్నారు. అంటే దసరావరకూ పెద్ద హీరోల సినిమాలు రావుట. ఈలోగా చిన్న సినిమాలే వస్తాయని అంటున్నారు. 

 

దాంతో ముందు సినిమా హాళ్ళు తెరిస్తే చాలు అని ఆ తరువాత కధ చూసుకోవచ్చునని భావిస్తున్నారుట. ఇక సినిమాలకు సంబంధించి కూడా చూసుకుంటే హాళ్ల వద్ద ఎంతో మంది బతుకుతూంటారు. సినిమాల్ హాళ్ళు తెరవకపోతే పెద్ద ఎత్తున ఆ కుటుంబాలు ఇబ్బందులో పడతాయి. మొత్తానికి ఆ వర్గం కూడా బాగుండాలంటే సినిమా హాళ్ళు తెరచుకునేలా పర్మిషన్ ఇవ్వడమే మంచిదని అంటున్నారు. 

 

ఇక ఇపుడు కరోనా భయం మెల్లగా తగ్గుతోంది. ఉపాయంతో కరోనాను ఎదుర్కోవడానికి జనం సిధ్ధ‌పడుతున్నారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రం సినిమా హాళ్ళు ఉండాల్సిందేనన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: