'అర్జున్ రెడ్డి' సినిమా తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఎవరూ ఊహించని విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అనేక అవకాశాలు అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా రాకముందు వరకూ విజయ్ దేవరకొండ కి పెద్ద గా క్రేజ్ లేదు. అయితే ఈ సినిమా రావడంతో ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వెంటనే డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ‘గీత గోవిందం’ అనే సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ చూద్దామని అనుకుంటున్న యాంటీ ఫ్యాన్స్  సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

 

విజయ్ దేవరకొండ నటించిన ఇటీవల సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై భయంకరమైన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ దెబ్బతో విజయ్ దేవరకొండ చాలావరకు సైలెంట్ అయిపోయాడు. ఇటువంటి సమయంలో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా తరహాలో మొట్టమొదటి సారి తన టాలెంట్ను నిరూపించుకోడానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి కావడం జరిగింది. అయితే ఇటీవల కరోనా వైరస్ రావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఒక డైరెక్టర్ నుండి డిఫరెంట్ పోస్ట్ వచ్చింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మోహన్ కృష్ణ ఇంద్రగంటి.

 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టు పెట్టారు.  ''ఈ ఏడాది నువ్వు మంచి సినిమాలు ఇంకా చేయాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని అన్నారు. దీనికి విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ..''థ్యాంక్స్.. నాకు తెలుసు.. అయితే ఆ అద్భుతం మనమిద్దరం కలిసి చేయబోతున్నాం'' అని అన్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంద్రగంటి తో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని అందరికీ అర్థమైపోయింది. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క కెరియర్ చాలా రిస్క్ లో ఉంది ఇటువంటి టైములో అలాంటి డైరెక్టర్ తో సినిమా అవసరమా అని విజయ్ దేవరకొండ అభిమానులు ఈ కాంబినేషన్ పై కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: