సినీ రంగం నుండి చాలా మంది రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే అందులో అతి తక్కువ మంది సక్సెస్ అయ్యారు. సినిమాల్లో రాణించినా రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రస్తుతం సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్లి  అక్కడ కూడా తనకంటూ ఒక స్థానాన్ని అభిమానుల గుండెల్లో నిలుపుకున్న హీరో పవన్ కళ్యాణ్. అయితే రాజకీయ వ్యవహారాలతో బిజీ అయ్యి గత కొంత కాలంగా సినిమాలను దూరం పెట్టారు పవన్. అయితే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళి సినిమాలపై ఫోకస్ చేసారు. 

 

వరుస ఆఫర్ లతో సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు సదరు హీరో గారు. అయితే ప్రస్తుతం  పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాలు ఇంకా పూర్తి కాక ముందే పవన్ వేరే సినిమాలకు కూడా ఓకే చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వకీల్ సాబ్ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది అని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తున్న సమాచారం. 

 

లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారని కథనం. అయితే హరీష్ శంకర్ 28 వ సినిమా తర్వాత 29 సినిమాగా మరొక మళయాళ సినిమా రీమేక్ సినిమాకు పవన్ సిద్దమైనట్టు పుకారు. డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో మళయాళ స్టార్ హీరో పృద్వీ రాజ్ పోషించిన పాత్ర తెలుగులో పవన్ పోషిస్తారని వార్తలు ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్నాయి. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి ఇది ఎంత వరకు నిజమో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: