తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కేరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించి పెళ్లి చూపులు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమా అందించిన విజయంతో తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు చేశాడు. అవి రెండు విజయ్ ని ఇండస్ట్రీలో టాప్ హీరోని చేశాయి. దానితో విజయ్ వెనక్కి తిరిగి చూసే పని లేకుండా వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే గత కొంతకాలంగా భారీ అపజయాలను మూటకట్టుకున్న విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ పైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

 

లాక్ డౌన్ వేళ సినిమా అన్నింటికీ విరామం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో సోషల్ మీడియా ద్వారా అందరు ఆర్టిస్ట్ లు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాని విజయ్ మాత్రం పలు సేవా కార్యక్రమాలతో అభిమానుల మన్ననలు అందుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్న ఫైటర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ తో జోడి కానుంది. అయితే ఈ సినిమా తర్వాత శివ, దిల్ రాజు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే వీటి గురించి ఇంకా ఏ విధమైన ప్రకటన రాలేదు. 

 

రీసెంట్ గా విజయ్ ఇంద్రగంటి తో సినిమా చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మే 9 న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు విజయ్ కి విషెస్ చెప్పారు. వారిలో ఇంద్రగంటి మోహన కృష్ణ  చేసిన సోషల్ మీడియా పోస్ట్  ఇప్పుడు విజయ్ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఆ సోషల్ మీడియా పోస్ట్ లో నువ్వు ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేయాలి. నువ్వు చేసే అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నాము అని ఉంది. దీనికి సమాధానంగా విజయ్ కూడా ఆ అద్భుతాలు మనిద్దరం కలిసే చేయాలని రిప్లయ్ ఇచ్చాడు...   దీనితో ఇంద్రగంటి తో విజయ్ సినిమా పక్కా  అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: