టాలీవుడ్ లో  లక్ష్మి, బాస్ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయన తార. కాలేజి రోజుల నుండి మోడలింగ్ చేసిన నయనతార అనుకోకుండా సినిమాలలోకి వచ్చింది. ఒక సినిమా మాత్రమే అనుకుని ప్రారంభించిన కెరీర్ తర్వాత వచ్చిన ఆఫర్ లతో అగ్ర హీరోలతో నటించే అవకాశాలను తెచ్చి పెట్టాయి. కేరళలో పుట్టిన నయన కేవలం మళయాళంలోనే కాక తమిళం, తెలుగు సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసిన విభిన్న పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. 

 

 నయనతార  సినిమాలతోనే కాక వ్యక్తిగత జీవితంలో కూడా పలు మార్లు వార్తల్లో నిలిచారు. కెరీర్ ప్రారంభంలో వల్లవన్ సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా హీరో అయిన శింబుతో ప్రేమాయణం నడిపింది. తర్వాత ఆయనతో బ్రేక్ అప్ అయినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ప్రభుదేవాతో  ప్రేమలో ఉన్నట్టు వార్తలు బలంగా వినిపించాయి. దీని గురించి ప్రభు దేవా కూడా స్పందించి మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపారు. రెండేళ్లు సాగిన వీరి ప్రేమాయణం స్వయంగా నయనతార యే  మేమిద్దరం విడిపోయామని వెల్లడించింది.

 

అయితే తాజాగా తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ గురించి సౌత్ ఇండియా పరిశ్రమలో అందరికి తెలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య వీరిద్దరూ కలిసి వెళ్ళిన ఒక ఫంక్షన్ లో నయన విగ్నేష్ తన హబ్బి అని వెల్లడించింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా విగ్నేష్ కూడా ఒక ఆసక్తికర పోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందులో నయన ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకున్న పోటో కనపడింది. దీనికి క్యాప్షన్ గా భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోతున్న నయనకు హ్యాపీ మదర్స్ డే అని తెలిపారు.  అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: