కమర్షియల్ సినిమాకు ఎక్స్ ట్రా డోస్ ఇచ్చేలా డైరెక్టర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఐటమ్ సాంగ్స్ పెడతారు. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ సాంగ్స్ ఇప్పుడు ప్రతి సినిమాలో కంపల్సరీ అవుతున్నాయి. ఏవో కొన్ని సినిమాల్లో తప్ప ఐటెమ్ సాంగ్ లేని సినిమాలు చాలా అరుదని చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ ఐటెమ్ సాంగ్స్ కు స్పెషల్ గా కొంతమంది భామలు ఉండేవారు. కానీ ఇప్పుడు అవి కూడా హీరోయిన్స్ చేస్తున్నారు. 

 

తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చే భామ మిల్కీ బ్యూటీ తమన్నా. అమ్మడు ఎలాంటి సినిమాలో అయినా ఐటెమ్ సాంగ్ చేస్తుంది. దానికి తగినట్టుగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది. కొత్త పాత అనే తేడా లేకుండా హీరో ఎవరైనా తను అడిగిన రెమ్యూనరేషన్ ఇస్తే చాలు సాంగ్ చేసేస్తుంది తమన్నా. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటి సినిమా అల్లుడు శ్రీను సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ సూపర్ అనిపించింది. అసలే ఆ సినిమా లో హీరోయిన్ గా సమంత నటించగా తమన్నా స్పెషల్ సాంగ్ కేక పెట్టించింది. 

 

తనదైన స్టైల్ లో అందాలని ప్రదర్శించడంలో ముందుండే తమన్నా అల్లుడు శ్రీను సాంగ్ లో అదరగొట్టింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఐటెమ్ సాంగ్ అంటే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. మొదటి సినిమాతోనే బెల్లంకొండ బాబు తమన్నాతో డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత మరో సినిమాలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో తమన్నాకి మంచి మార్కులు పడతాయి. అమ్మడు ఇలానే సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్స్ చేయాలనీ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. తప్పకుండా తమన్నా సినిమాలతో పాటుగా ఇలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయడంలో ఎలాంటి వెనుకడుగు వేయదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: