ఐటమ్ సాంగ్స్ చేసేందుకు హీరోయిన్లు కూడా ముందుకు వస్తున్నారని ఇప్పుడు స్పెషల్‌ గా చెప్పుకుంటున్నారు. కానీ చాలా ఏళ్ల క్రితమే ఏకంగా సూపర్‌ స్టార్‌ ఐటమ్‌ సాంగ్ చేశాడు. దర్శకుడు ఎస్వీ krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాడు. తనకు సన్నిహితులైన హీరోలతో తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయించాడు. అలా ఏకంగా సూపర్‌ స్టార్ ‌తోనే ఓ చిన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాడు.

 

అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ సినిమా యమలీల. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా కామెడీ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది. యమలోకం లో చిత్రగుప్తుడు భవిష్యవాణి పుస్తకాన్ని పోగొట్టుకోవటం, దాన్ని వెతుక్కుంటూ యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి రావటం అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. సినిమా అంతా ఒక ఎత్తయితే ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్ మరో ఎత్తు.

 

అంతకు ముందుకు కృష్ణ హీరోగా సినిమాలు చేసిన ఎస్వీ కృష్ణా రెడ్డి కి ఆయనతో మంచి అనుబంధం ఉంది . ఆ చనువుతోనే అలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని కోరాడు. కృష్ణారెడ్డి మీద గౌరవం తో కృష్ణ కూడా వెంటనే అంగీకరించాడు. అలా తెర మీదకు వచ్చిందే జుంబారే జు జుంబరే పాట. తెర మీద కృష్ణకు జోడి గా పూజ నటించిన ఈ పాటకు కృష్ణారెడ్డి స్వయంగా స్వరాలందించగా జోన్నవిత్తుల సాహిత్యమందించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం, చిత్రలు అద్భుతంగా ఆలపించారు. యమలీల సినిమా సక్సెస్ ‌లో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: