ప్రస్తుతం కమర్షియల్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ అయిపోయింది. గ్లామర్‌ క్వీన్‌ లతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ ‌లో నటించేందకు సై అంటున్నారు. మరి ఇంతగా పాపులర్‌ అయిన ఈ స్పెషల్‌ సాంగ్స్‌ ఎప్పుడు ప్రారంభమయ్యాయి. అసలు తొలి ఇండియన్ ఐటమ్‌ సాంగ్ ‌లో ఎవరు నటించారు. ఆ పాట లో ఆడిపాడిన నటి ఎవరు. .? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వారి కోసం ఈ అప్‌ డేట్.

 

ప్రస్తుతం సూపర్‌ పాపులర్‌ అయిన ఐటమ్‌ నంబర్‌ అనే ఫార్ములా ను ఇండియాన్‌ స్క్రీన్‌ మీద 1958 లోనే ప్రయోగించారు. బాలీవుడ్‌ సినిమా కమర్షియల్‌ ఫార్ములా దిశగా అడుగులు వేస్తున్న తొలి నాళ్లలోనే ఐటమ్‌ సాంగ్స్ ‌ను మొదలు పెట్టారు. తొలిసారిగా హౌరా బ్రిడ్జ్‌ సినిమా లో మేరా నామ్ చిన్‌ చిన్‌ చూ అనే పాటను సినిమా కథతో సంబంథం లేకుండా కేవలం ఓ స్పెషల్ సాంగ్‌ తరహాలో రూపొందించారు. ఇదే తొలి ఐటమ్‌ సాంగ్‌ గా పరిగణిస్తున్నారు ఇండియన్ మూవీ లవర్స్‌.

 

ఈ పాట లో బాలీవుడ్ గ్లామర్ దివా హెలెన్‌ ఆడిపాడింది. ఈ పాటలో హెలెన్‌ షాంగై నుంచి వచ్చిన ఓ నృత్య కారిణి పాత్రలో కనిపించింది. హిందూస్థాని స్టైల్ ‌లో రూపొందించిన ఈ పాటకు ఓపీ నయ్యర్ సంగీతం అందించగా గీతా దత్‌ ఆలపించారు. ఈ పాట హెలెన్‌ కెరీర్ ‌లోనే బిగ్గెస్ట్ హిట్ ‌గా నిలిచిపోయింది. 2018 లో ఈ పాటకు రీమిక్స్ వర్షన్‌ వచ్చినా.. ఒరిజినల్ స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ముఖ్యంగా హెలెన్ అందం, గీత దత్ వాయిస్‌ లోని మాధుర్యం రిక్రియేట్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: