ఎప్ప‌టి నుంచో సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అనేవి చాలా కామ‌న్‌. అయితే ఒక‌ప్పుడు క‌థ‌ను బ‌ట్టి కావాలంటే పెట్ట‌డం లేదంటే లేదు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు అలా కాదు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ఐటెమ్ సాంగ్ అనేది కంప‌ల్‌స‌రీ అయిపోయింది. ఐటెమ్ సాంగ్ లేనిదే నేటి సినిమాల్లో ప‌ని జ‌రగ‌డం లేదు. ఇక ఐటెమ్ సాంగ్ కోసం ఒక‌ప్పుడు ప్ర‌త్యేకంగా కొంత‌మంది న‌టీమ‌ణులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేసేస్తున్నారు. దీంతో ఐటెమ్‌సాంగ్‌కి కూడా బాగా డిమాండ్ పెరిగింద‌ని చెప్పాలి. ప్రస్తుతం  సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు ఉన్నారు. కానీ వారందరూ స్టార్ హోదాని చేరుకోలేపోతున్నారు. మరి కొంతమంది నటీమణులైతే ఒకటి..రెండు చిత్రాలతోనే కనుమరుగై పోతున్నారు. స్టార్ హోదాని అనుభవిస్తున్న నటీమణుల సంఖ్యని వేళ్లపై లెక్కించవచ్చు. 

 

ప్రస్తుతం ఒకటో..రెండో చిత్రాల్లో తప్ప మిగతా సినిమాలో ఐటెమ్ సాంగ్ అనేది సాధారణంగా మారింది. ఒకప్పుడు ఐటెమ్ సాంగ్ అంటే ఆ పాట కోసమే ప్రత్యేకమైన నర్తకిలు..నటీమణులు ఉండేవారు..జయమాలిని..జ్యోతిలక్ష్మీ.. అనురాధ లాంటి తారలు   ఈ పాటలతోనే ఎంతో ఫేమస్ అయ్యారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారి..ఐటెంసాంగ్ అర్థం కూడా మారిపోయింది. స్టార్ హీరోల చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ లో మెరవడం విశేషంగా మారింది. పక్కా లోకల్ నేను పక్కా లోకల్ అంటూ కాజల్ ..ఎన్టీ ఆర్ తో ఆడి పాడింది. ఇకపోతే అనుష్క స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో ఐ వాంట్ ద సూపర్ మ్యాన్ అంటూ కాలు కదిపింది. విశ్వ నటుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో  ముద్దుగా నా పేరు బొండుమల్లి అని ఫుల్ గ్లామర్ ని ఆరబోసింది. స్వింగ్ జర సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే..అంతలా మెరిసింది ఈ బ్యూటీ... ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు నటీమణులు తమ హోదాని పక్కనపెట్టి ఇలా సినిమా అంతటికి ఒక పాటలో మెరవడానికి చాలా ఇంట్రెస్ట్ ని చూపుతునారు. ఇక దీనికి సంబంధించిన రెమ్యూన‌రేష‌న్లు కూడా అదే విధంగా మోత‌మోగించేస్తున్నారు. ఒక‌పాట‌కి చిందేసి కోట్లు లాగేస్తున్నారు. 

 

వీరంతా ఐటెమ్ సాంగ్స్ లో కనిపించడానికి చాలా కారణాలే ఉన్నాయి.  ఓ స్టార్ హీరోయిన్ ఐటెమ్ సాంగ్ లో ఉందని తెలిస్తే ఆ చిత్రానికి ఓ ఫేమ్..ఆ చిత్ర దర్శక..నిర్మాతలకి  కాసుల వర్షం కురుస్తుందని వారి గాఢ నమ్మకం. మరి నటీమణుల సంగతేంటి అనుకుంటున్నారా. వారేం ఊరికే ఇలా ప్రత్యేక గీతాల్లో కనిపించడం లేదు. ఆ పాట ఇంపార్టెంట్..కంటెంట్ ని బట్టి ఐటెమ్ సాంగ్ లో మెరిసే తారలకి భారీ పారితోషికాన్ని ముట్టజెప్పుతున్నారు నిర్మాతలు. దాంతో డబ్బుకి డబ్బు ఆ చిత్రంలో తాము ఉన్నామనే భావన మన నటీమణులకు దక్కుతుంది. ఒక దెబ్బకి రెండు పిట్టల‌న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: