ఐటెమ్ సాంగ్స్ అంటే కేవ‌లం టాలీవుడ్ మాత్ర‌మే బాలీవుడ్ సాంగ్స్ కూడా ఉంటాయి. అందులో బాలీవుడ్ ఐటెమ్ సాంగ్ అంటే అందాల ఆర‌బోత కాస్త ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెప్పాలి మ‌రి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలంటే ఇప్ప‌టికీ ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే సల్మాన్ సినిమాలు ఒకెత్తు అయితే.. అందులోని పాటలు మరో ఎత్తు అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ నటించిన, నటించే ప్రతీ సినిమా మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. త‌న సినిమాల్లో మ్యూజిక్‌కి అంత‌లాగా ఇంపార్టెన్స్ ఉంటుంది.  ఇక మాస్ బీట్స్‌కు అయితే సల్మాన్ ఖాన్ చిత్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. 

 

దబాంగ్, భజరంగీ భాయీజాన్, కిక్, కిక్ 2, భారత్, టైగర్ జిందా హై లాంటి చిత్రాల్లో పాటలు ఇప్పటికీ మార్మోమోగుతూనే ఉంటాయి. మాస్ బీట్స్‌లో సల్మాన్ ఖాన్ చిత్రాల్లో మున్నీ బద్నామ్ హూయీ..డారిలింగ్ తేరే లియే సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. ఈ ఒక్క పాటే అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో సల్మాన్ ఎనర్జీ, మలైకా అరోరా అందాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా పాటను పాటకు ఎంతో హైలెట్‌గా నిలిచాయి.

 

అది నచ్చే మన గబ్బర్ సింగ్‌లో కెవ్వుకేక సాంగ్‌ను డిజైన్ చేశారు. అయితే దబాంగ్ 2 చిత్రంలోనూ కరీనా కపూర్‌తో చేసిన ఓ ఐటెమ్ సాంగ్ కూడా అదిరిపోయింది. తాజాగా దబాంగ్ 3లోమరోసారి ఐటెమ్ సాంగ్‌తో రెచ్చిపోయాడు.  దబాంగ్ సిరీస్ లో మూడో భాగం  ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో సల్మాన్ తో పాటు మమతా శర్మ చిందేసింది. 'మున్నా బద్మామ్ హువా' అంటూ సాగే పాటకు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక విడుద‌ల చేసిన కాసేప‌టికే కోటి వ్యూస్ పైనే సాధించి టాప్‌లోకి వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: