టాలీవుడ్ లో గత పదేళ్ళలో వచ్చిన సంచలనాల్లో రంగస్థల౦ సినిమా కూడా ఒకటి అనేది వాస్తవం. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంది. సినిమా ఎంత హిట్ అయింది అనేది పక్కన పెడితే ఈ సినిమాలో అతని నటన సినిమా కథ మాత్రం ప్రేక్షకులు ఇప్పట్లో మర్చిపోయే విధంగా లేదు అనేది నిజం. ప్రతీ సన్నివేశం కూడా ఒకటికి పది సార్లు చూసే విధంగా ఉండే విధంగా తీసుకొచ్చారు అనేది నిజం. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశంలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్సినిమా ముందు రామ్ చరణ్ అనే విధంగా ఈ సినిమా వచ్చింది. 

 

ఇక ఈ సినిమాలో పాట లు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే పాట లు ఉన్నాయి. రంగమ్మ మంగమ్మ పాట తో పాటుగా ఈ సినిమాలో ఉండే జిగేల్ రాణీ అనే ఐటెం సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది. ఈ సినిమాలో ఈ పాట ఒక హైలెట్ గా నిలిచింది అనేది వాస్తవం. ఈ పాట లో రామ్ చరణ్ డాన్స్ తో పాటుగా పూజ హెగ్డే డాన్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఒక సన్నివేశానికి తగిన విధంగా ఈ పాటను సుకుమార్ తీసుకొచ్చాడు. ఈ పాట ద్వారా ఈ సినిమాకు కమర్షియల్ అనే గుర్తింపు కూడా వచ్చింది అనేది వాస్తవం. 

 

ఈ పాట ను పల్లెటూరి వాతావరణం ఉండే విధంగా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. సినిమా కథకు తగిన విధంగానే పాటను తీసుకొచ్చాడు అనేది వాస్తవం. ఈ పాట ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇక పూజ కూడా ఐటెం  గర్ల్ గా మంచి గుర్తింపు కూడా ఈ పాట తో సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: