క‌మెడియ‌న్లు చాలా మంది హీరోలుగా మారిన విష‌యం తెలిసిందే. అయితే వాళ్ళ‌లో కొంద‌రు స‌క్సెస్ అయితే మ‌రికొంత‌మంది ఫెయిల‌య్యారు. అయితే వీళ్ళ‌లో ఎక్కువ‌మంది ఫెయిల్యూర్లే క‌నిపిస్తారు. ఇక ఒక‌సారి క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకున్నాక‌. తిరిగి హీరో అవ‌తార‌మెత్తితే అందులో స‌క్సెస్ కాలేక‌పోతే మాత్రం వాళ్ళు మ‌ళ్ళీ అటు క‌మెడియ‌న్లుగా కాదు క‌దా క‌నీసం సైడ్ క్యారెక్ట‌ర్స్ లో చేయ‌డానికి కూడా సెట్ కావ‌డంలేదు. ఈ విష‌యం తెలిసి కూడా చాలా మంది మ‌ళ్ళీ అదే ఊభిలో దిగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే...స్టార్ క‌మెడియ‌న్ సునీల్ ప‌రిస్థితి కూడా దాదాపు అలానే అయింది. క‌మెడియ‌న్‌గా మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు హీరోగా ట్రై చేశాడు. అయితే పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. దాంతో తిరిగి మ‌ళ్ళీ క‌మెడియ‌న్ అవ‌తార‌మెత్తినా కూడా ప్రేక్ష‌కులెవ‌రూ కూడా పెద్ద‌గా ఆద‌రించ‌క‌పోవ‌డంతో విల‌న్ అవ‌తార‌మెత్తాడు. 

 

కానీ ఎందుకో రీ ఎంట్రీలో పెద్ద‌గా క్రేజ్ అయితే రావ‌డం లేదు. మ‌రి ఇప్పుడు మ‌రో క‌మెడియ‌న్ విల‌న్ అవ్వాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. పెళ్ళి చూపులు చిత్రంలో త‌న‌దైన శైలిలో నేచ‌ర‌ల్ కామెడీతో ఆక‌ట్టుకుని మ‌ల్లేశం లాంటి మంచి చిత్రంలో హీరోగా అద‌ర‌గొట్టిన ప్రియ‌ద‌ర్శి విభిన్న‌మైన పాత్ర‌ల‌కు బాగా సెట్ అవుతున్నాడు. ఇక ప్రియ‌ద‌ర్శి కూడా వ‌చ్చిన అవ‌కాశాల‌ని వ‌దులుకోకుండా చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుని చేసుకుంటున్నాడు. ఇటీవ‌లె అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో లూజ‌ర్ అనే వెబ్‌సిరీస్‌లో కూడా న‌టించాడు. తాజాగా ఇంట‌ర్వ్యూలో ఆశ‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డించాడు.

 

ఇక కామెడీ చెయ్య‌డం చాలా తేలిక‌ని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది చాలా క‌ష్ట‌మ‌ని ప్రియ‌ద‌ర్శి అంటున్నారు. ఇక కామెడీలో మంచి మార్కులు తెచ్చుకున్న‌ప్ప‌టికీ న‌న్ను చాలా మంది మీరు క‌మెడియ‌నా లేక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టా అని అడుగుతున్నారు. అన్ని ర‌కాల పాత్ర‌ల్లో న‌న్ను నేను బెస్ట్ అనిపించుకోవాలని బాగా తాపత్ర‌య‌ప‌డుతున్నారు. ఇది ప్ర‌తి యాక్ట‌ర్‌లోనూ ఉండేదే. ఇక విల‌న్ పాత్ర‌ల్లో కూడా న‌టించి మంచి పేరు సంపాదించాల‌ని ఉంది అని ఆయ‌న అంటున్నారు. ఇక న‌టిగా ఒక ప‌దిమెట్లు ఎక్కాలంటే మంచి పేరు సంపాదించాలి. అలాగే ఏ పాత్ర‌లోనైనా న‌టించ‌గ‌ల‌గాలి అంటున్నారు ప్రియ‌ద‌ర్శి.

మరింత సమాచారం తెలుసుకోండి: