తమిళనాట సినిమా స్టార్లకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. రజినీకాంత్, అజిత్, విజయ్ లాంటి హీరోలను వాళ్ల జీవితంలో ఓ పార్ట్ అయినట్టు  చూస్తారు. అయితే అలాంటి అగ్ర కథానాయకులను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చిన్న హీరోలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. మీరు తగ్గలేరా అని కామెంట్స్ చేస్తున్నారు.  

 

అజిత్, విజయ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు తమిళనాట థియేటర్లకు పూనకాలు వస్తాయి. వీళ్ల సినిమాలతో బాక్సాఫీస్ కూడా  ఓ ట్రాన్స్ లోకి వెళ్తుంది. ఈ హీరోలు పాలిటిక్స్ లోకి వస్తే తమిళ రాజకీయాలు ప్రభావితమవుతాయని విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి స్టార్లపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ హీరోలు నిర్మాతల గురించి ఆలోచిస్తున్నారా.. లేదా అని ప్రశ్నలేస్తున్నారు నెటిజన్లు. 

 

లాక్ డౌన్ తో ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్లింది. నిర్మాతలు వడ్డీల భారం మోస్తున్నారు. పోస్ట్ లాక్ డౌన్ లో ఇంతకుముందులా భారీ సినిమాలు తియ్యలేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ ఆంటోనీ.. హరీశ్ కళ్యాణ్ లాంటి చిన్న హీరోలు నిర్మాతలకు అండగా నిలవడానికి రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని చెబుతున్నారు. 

 

చిన్న హీరోలు శాలరీ తగ్గించుకుంటామని చెబుతున్నా.. టాప్ హీరోలు మాత్రం దీనిపై మాట్లాడలేదు. అజిత్, విజయ్ లాంటి హీరోలు రెమ్యునరేన్ల ప్రస్తావనే తీసుకురావడం లేదు. దీంతో  పెద్ద హీరోలకు నిర్మాతల సమస్యలు పట్టవా అని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. అయితే సోషల్ సర్వీస్ లో ముందుండే విజయ్ లాంటి హీరోలు పారితోషికం తగ్గించుకుంటామని ప్రచారం చేసుకోకపోయినా.. సాయం చేయాల్సిన టైమ్ లో నిర్మాతలకు సాయం చేస్తూనే ఉంటారు. ఇలాంటి విమర్శలు మానెయ్యండని నెటిజన్లకు కౌంటర్లు ఇస్తున్నారు కోలీవుడ్ జనాలు. మొత్తానికి నెటిజన్లు కోలీవుడ్ టాప్ హీరోలను టార్గెట్ చేశారు. స్టార్లకు నిర్మాతల సమస్యలు పట్టవుా అంటూ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో చిన్నహీరోలను చూసి నేర్చుకోండంటూ చురకలు అంటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: