సాధారణంగా పెళ్లీడుకొచ్చిన వారిని నీ పెళ్లెప్పుడంటూ కనిపించిన వారందరు అడుగుతుంటారు. అదే సెలబ్రెటీలైతే మీడియా నుండి సోషల్ మీడియా దాకా పెళ్లెప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.. వారి పెళ్లి ఎప్పుడని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు.. ఇలా ఆర్టికల్స్ కూడా రాసేస్తుంటారు. మన టాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటికే దాదాపు అందరు పెళ్లీడు హీరోలకి పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఎవరో ఒకరిద్దరు బ్యాచిలర్ హీరోలకు తప్ప. వారిలో కూడా కొందరికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోగా ఈ కరోనా మహమ్మరి కారణంగా పెళ్లి వేడుకలు వాయిదా పడ్డాయి. నితిన్ పెళ్లి వాయిదా పడగా.. ఈ కరోనా ఇప్పుడల్లా తగ్గేలా లేదులే అని నిఖిల్ పెళ్లి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు.

 

ఇక దగ్గుబాటి రానా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. చడీచప్పుడు లేకుండా తనకు కాబోయే అర్థాంగిని పరిచయం చేశాడు. ఈ విషయం రానా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. మిహికా బజాజ్ తన ప్రేమను అంగీకరించిందని రానా వెల్లడించాడు. ఈ మేరకు మిహికాతో కలిసి దిగిన ఫొటోను సైతం సంతోషంగా షేర్ చేశాడు. టాలీవుడ్‌ లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ గా ఉన్న రానా.. ఓ ఇంటివాడు కాబోతుండటంతో పలువురు సినీ ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. లాక్ డౌన్ అనంతరం వీరి పెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో పెళ్లి విషయంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ ప్రభాస్ పై ఇప్పుడు మరింత ఒత్తిడి పెరిగిపోయింది.

 

సోషల్ మీడియా వేదికగా 'భల్లాలదేవ' ప్రకటించేశాడు.. మరి 'బాహుబలి' సంగతి ఏమిటని గట్టి డిమాండ్ వినిపిస్తుంది. అందులోను ప్రభాస్ రానా కంటే వయసులో కూడా పెద్ద వాడు. మరి ఈ డిమాండ్స్ కి ప్రభాస్ ఏమి సమాధానం చెవుతాడో చూడాలి. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అప్పట్లో గట్టిగా వినిపించింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి 3ఏళ్ళు అవుతుంది. అలాగే ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి నిర్మాణ దశలలో ఉండగా మరొకటి అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటి దాకా ప్రతిసారి షూటింగ్ వుందని.. ఆ సినిమా కంప్లీట్ చెయ్యాలని.. పెళ్లి మ్యాటర్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కావడంతో ఇంటికే పరిమితమైన మన హీరో ఇప్పుడు కుటుంబ సభ్యులకు దొరికిపోయాడు. దీంతో రోజూ పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారట. కానీ ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: