స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనురాధ మెహతా హీరో హీరోయిన్లగా నటించిన ఆర్య చిత్రం అప్పట్లో తెలుగు పరిశ్రమలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అల్లు అర్జున్ కి రెండవది కాగా... ఇందులోని అతని నటనా చాతుర్యం అందరిని ఆశ్చర్యపరిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2004 వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ లో వచ్చిన సినిమాలకు చాలా భిన్నంగా ఉండటం అందరి ప్రశంసలకు విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.


ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చగా... ఇందులోని పాటలన్ని సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమాలోని ఉన్న ఆరు పాటలు ఆడియన్స్ ను అద్భుతంగా అలరించాయి. అప్పట్లో ఆర్య సినిమా పాటలు విడుదలై రెండు మూడు సంవత్సరాల అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఆ చిత్రం పాటలను వినాలి అంటే అతిశయోక్తి కాదు.


ఆర్య సినిమాలోని పాటల గురించి సమగ్రంగా తెలుసుకుంటే మొదటిగా యూ రాక్ మై వర్ల్డ్ (You Rock My World)  పాటను సింగర్ షాన్ ఆలపించగా... ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో- పాటను సాగర్ ఆలపించాడు. సింగర్ రవి వర్మ చేత ఓ మై బ్రదరు, చెబుతా వినరో అనే కుర్రకారు పాటకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్ ఎనలేని ఖ్యాతిని పొందారు. సింగర్ టిప్పు పాడిన థకథిమితోం కూడా ఆడియన్స్ ని బాగా అలరించింది. గాయకుడు కేకే 'పాడిన నా ప్రేమను కోపంగానో' పాట అప్పట్లో రికార్డులు తిరగరాసింది అని చెప్పుకోవచ్చు.


అ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్రలో కూడా సూపర్ హిట్ అయింది. ట్రైన్ పై కొనసాగే ఈ గీతం లో నటీమణి అభినయశ్రీ తన అందచందాలతో రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ పాటను మహారాష్ట్ర ప్రజలు వింటున్నారంటే దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతుంది.







మరింత సమాచారం తెలుసుకోండి: