అల్లు అర్జున్ స్టెప్పులకు బాలీవుడ్ జనాలు ఫిదా అవుతున్నారు. స్టైలిష్ స్టార్ స్టెప్పుల్లో ఓ మేజిక్ ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. బీటౌన్ డాన్సింగ్  స్టార్స్ కూడా బన్నీ మూమెంట్స్ కు ఇంప్రెస్ అవుతున్నారు. దీంతో ఈ సదరన్ స్టార్ ముంబయిలో జెండా ఎగురవేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. 

 

అల్లు అర్జున్ డాన్స్ లకు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. బన్నీ డ్యాన్స్ మూమెంట్స్ కు అభిమానులుగా మారిన వాళ్లు ఉన్నారు. వాళ్లను సంతృప్తి పరచడానికి ప్రతీ సినిమాలో కొత్తకొత్త మూమెంట్స్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ హార్డ్ వర్క్ కు బాలీవుడ్ జనాలు ఇంప్రస్ అవుతున్నారు. డాన్సింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ కూడా బన్నీ డ్యాన్స్ సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. 

 

షాహిద్ కపూర్ రీసెంట్ గా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అందులో ఒక ఫ్యాన్ అల్లు అర్జున్ గురించి వన్ వర్డ్ లో చెప్పమని అడిగాడు. దానికి బన్ని డ్యాన్సింగ్ స్కిల్స్ చాలా ఇష్టమని ఆన్సర్ చేశాడు. ఇక ఇంతకుముందు బాలీవుడ్ డ్యాన్సింగ్ డైనమైట్ హృతిక్ రోషన్ కూడా బన్నీ డ్యాన్సింగ్ స్టైల్ బాగుంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అలాగే స్పీడ్ మూమెంట్స్ తో మేజిక్ చేసే టైగర్ ష్రాఫ్ కూడా అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పాడు. 

 

అల్లు అర్జున్ డ్యాన్సులకు బాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలాగే హిందీ డబ్బింగ్స్ తో నార్త్ ఇండియన్స్ ను మెప్పించాడు. ఈ పాజిటివ్ వైబ్రేషన్ ను చూసే బన్నీ.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంటాడని అంచనా కడుతున్నారు సినీజనాలు. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న పాన్ ఇండియన్ మూవీ పుష్పతో ముంబయి వెళ్తున్నాడు అల్లు అర్జున్. మొత్తానికి అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీతో ముందుకెళ్తుండటంతో ఇక బాలీవుడ్ జనాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: