చిన్న పిల్లలు చేసే కొన్ని పనులు పెద్దలకు ముద్దుగా ఉంటాయి. వారి అల్లరి, సందడి లేకపోతే తల్లిదండ్రులకు ఏమాత్రం సరదా ఉండదు. పెద్దలు కూడా ఇదే తరహాలో వారికి కొన్ని పనులు అప్పగిస్తారు. పిల్లలు ఆయా పనులు చేసే తీరుతో పెద్దలు మురిసిపోతూ ఉంటారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. తానెంత యాక్టివ్ గా ఉంటాడో ఇప్పటికే పలు వీడియోల రూపంలో చూశాం. ఈసారి ఏకంగా ఛెఫ్ గా మారి సలాడ్ చేస్తూ తనలోని మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడు.

 

 

‘హలో గయ్స్.. నౌ ఐ ఆమ్ మేకింగ్ ఏ యూ ట్యూబ్ వీడియో ఆఫ్ మేకింగ్ సలాడ్..’ అంటూ ముద్దు ముద్దు మాటలతో అయాన్ సలాడ్ మేకింగ్ గురించి చెప్తున్నాడు. కావలిసినవన్నీ దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటి వివరిస్తూ అన్ని కలిపి ఓ గెన్నెలో వేస్తున్నాడు. రియల్ ఛెఫ్ ఎలా అయితే కుకింగ్ వీడియోలో ఓ ఇంగ్రీడియంట్ ను వివరిస్తూ యాడ్ చేస్తారో అలానే చేశాడు అయాన్. ఇంకా చెప్పాలంటే తన ఇంగ్లీష్ యాక్సెంట్ తో చాలా ఆకట్టుకున్నాడు ఈ జూనియర్ బన్నీ. పైగా సలాడ్ మనకు బలాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు కూడా. ఈ వీడియోను బన్నీ వైఫ్ స్నేహ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

 

రీసెంట్ గా నింజా జంప్ తో ఆకట్టుకున్న అయాన్ ఇప్పుడు చెఫ్ గా ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘టూ క్యూట్ అయాన్’, ‘ఇప్పుడే ఇంత టాలెంట్ ఉంటే పెద్దయ్యాక తండ్రినే మించిపోతాడుగా’, ’నైస్ టాలెంట్’.. అంటూ మెచ్చకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Salad :)

A post shared by allu sneha Reddy (@allusnehareddy) on

మరింత సమాచారం తెలుసుకోండి: