టాలీవుడ్ లో సినిమాలు ఫ్లాప్ అయినా సరే సినిమాలో ఉండే పాట లు మాత్రం ప్రేక్షకులకు అలా గుర్తు ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఉండే పాటలకు మంచి డిమాండ్ ఉంటుంది. పాటల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అవి సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. పాట ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా తమకు నచ్చిన విధంగా ఉండే లా పాటలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ యువ హీరో అల్లు అర్జున్ సినిమాలో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. 

 

ఆయన సినిమాల్లో పాటలు ప్రతీ ఒక్క చోట కూడా వినపడుతూనే ఉంటాయి అనేది వాస్తవం. ఆయన హీరో గా వచ్చిన ఆర్య 2 సినిమాలో రింగా రింగా అనే పాట కు మంచి ఊపు వచ్చింది. ఈ సినిమాలో ఈ పాట హైలెట్ సినిమా ఫ్లాప్ అయినా సరే పాట మాత్రం సూపర్ హిట్ అయింది అనే చెప్పవచ్చు. పాట కోసం చాలా కష్టపడ్డాడు దర్శకుడు సుకుమార్. ఆ విధంగా ఈ పాట హిట్ అయింది. ప్రతీ పాట కూడా ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన అసారే ఈ సినిమాలో ఉండే ఈ పాట కు యూత్ ఫిదా అయిపోయింది అనే మాట వాస్తవం. 

 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పుష్ప అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈ సినిమాలో పాటల విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ తో ఒక ఐటెం సాంగ్ చేయించాలి అని ప్లాన్ చేస్తున్నాడు. మరి చేయిస్తాడా లేదా అనేది చూడాలి. ఆ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మంధన నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: