టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమా ఒక సంచలనం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన హరీష్ శంకర్ దర్శకత్వం ఒక సంచలనం, బండ్ల గణేష్ నిర్మాత గా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్ లను బద్దలు కొట్టింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా చాలా కష్టపడ్డారు అని అంటారు టాలీవుడ్ జనం. ఈ సినిమాలో ఆయన పాట కోసం దర్శకుడు దాదాపు ఏడాది పటు కసరాత్తులు చేసిన తర్వాత ఓకే చేసాడు అని చెప్తూ ఉంటారు. ఆయనకు ఇచ్చిన పాత్రలో అన్ని విధాలు గా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఓకే చేసాడు అని అంటారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వేరే సినిమా కథలను కూడా దాదాపుగా వినలేదు అనేది వాస్తవం. 

 

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా ఫ్లాప్ లు కూడా చూసారు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఉండే ఒక పాట ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనే విషయం ప్రత్యేక౦గా చెప్పాల్సిన అవసరం లేదు. కెవ్వు కేక అనే ఐటెం సాంగ్ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది అని అంటారు. టాలీవుడ్ లో ఈ పాట చూసిన తర్వాత దర్శక నిర్మాతలు ఐటెం సాంగ్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పడ్డారు అనేది వాస్తవం. దబంగ్ సినిమాలో ఉండే మున్నీ బద్నాం హుయి అనే పాట కంటే ఈ పాటే బాగుంది అనేది కొందరు అనే మాట. 

 

ఈ పాట కోసం దర్శకుడు ఎందరో అమ్మాయిలను చూసిన సరే ఆమెను మాత్రమే తీసుకుని పాటను పూర్తి చేసారు అని అంటారు. ఈ పాట తర్వాత ఐటెం సాంగ్స్ కి సినిమాల్లో డిమాండ్ కూడా పెరిగింది. స్టార్ హీరో సినిమా అనగానే ఐటెం సాంగ్ ఉండే విధంగా జాగ్రతలు కూడా పడ్డారు దర్శక నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: