మన తెలుగులో వచ్చిన కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. అగ్ర హీరోల సినిమాలు అయితే అది కూడా కమర్షియల్ సినిమాలు అయితే మంచి డిమాండ్ ఉంటుంది పాటలకు. ప్రతీ పాట కూడా జాగ్రత్తగా ఉండేలా చూస్తూ ఉంటారు. కమర్షియల్ సినిమాల్లో ఉండే పాట ల కోసం ప్రత్యేకంగా హీరోయిన్ లను కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్న హీరోల సినిమాలకు అంత ప్రాధాన్యత ఇచ్చే సందర్భాలు పెద్దగా ఉండవు గాని అగ్ర హీరోల సినిమాల్లో అయితే పాటల కోసం నానా కష్టాలు పడతారు. 

 

టాలీవుడ్ లో సంచలన౦ సృష్టించిన బాహుబలి సినిమాలో ఉండే ఒక ఐటెం సాంగ్ కోసం నానా కష్టాలు పడ్డాడు దర్శకుడు జక్కన్న. ఆ పాట కోసం ఆయన పడిన కష్ట౦ గురించి హీరోలు ఇప్పటికి చెప్తూనే ఉంటారు. ఆ సినిమాలో మనోహరి అనే ఐటెం సాంగ్ ఉంటుంది. ఈ పాటలో ముగ్గురు అమ్మాయిలతో ప్రభాస్ ఆడి పాడతాడు. ఆ పాట సూపర్ హిట్ అయింది. ఆ పాట కోసం ప్రభాస్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆ పాట తర్వాత అతని రేంజ్ కూడా పెరిగింది. సినిమా తో రేంజ్ ఏ విధంగా పెరిగిందో ఆ పాట తర్వాత ప్రభాస్ తో ఐటెం సాంగ్ అంటే చాలా కష్టపడాలి అనే విధంగా దర్శక నిర్మాతలు ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఇక ఈ సినిమా బద్దలు కొట్టిన రికార్డ్ లు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ గా నటిస్తున్నాడు అని సమాచారం. లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: