ద‌క్షిణ భార‌త సినిమా ప‌రిశ్ర‌మ‌లో 2000 వ ద‌శ‌కంలో సౌత్ ఇండియాలో స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన ఇమేజ్‌ను ప్ర‌ముఖ మ‌ళ‌యాళ హాట్ తార ష‌కీలా సంపాదించు కుంది. అప్ప‌ట్లో ష‌కీలా సినిమా వ‌స్తుందంటే స్టార్ హీరోలు సైతం అల్లాడి పోయేవారు. ఇంకా చెప్పాలంటే ష‌కీలా సినిమా వ‌స్తుందంటే కూడా స్టార్ హీరోలు త‌మ సినిమాను వాయిదా వేసుకునే ప‌రిస్థితి ఉండేది. ఆ త‌ర్వాత ఆమె హాట్ సినిమాల నుంచి కాస్త స్టార్ హీరోల‌తో పాటు మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాల్లోకి వ‌చ్చి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టించింది.

 

అంతెందుకు ప్ర‌తి శుక్ర‌వారం ఓ సినిమా రిలీజ్ అయ్యేది. ఆమె సినిమా వ‌స్తుందంటే స్టార్ హీరోల సినిమాల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టేవి. ఆమె సినిమాల కోసం స్టార్లు త‌మ సినిమాలు వాయిదా వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక అలా కొన్నేళ్లు పాటు హాట్ హాట్ సినిమాల‌తో ఓ వెలుగు వెలిగిన ష‌కీలా గ‌తంలో త‌న‌కు ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని ఇప్పుడు పంచుకుంది. ష‌కీలాకు అప్ప‌ట్లో ఫుల్ ఫామ్‌లో ఉండ‌గానే రోజు కు గాను ఆమెకు రు. 3 - 4 ల‌క్ష‌ల పారితోష‌కం ఇచ్చేవార‌ట‌. 

 

ఆమె మ‌ళ‌యాళ అమ్మాయి అయినా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్ భాష‌ల్లో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉండేది. అప్ప‌ట్లోనే ఆమె అంత సంపాదించినా అయిన వారిని నమ్ముకుని ఆమె అన్నీ కోల్పోయింది. అప్ప‌ట్లో చాలా మంది ప్ర‌ముఖులు ఆమె తో ఒక్క నైట్ గ‌డిపేందుకు ఏకంగా రు. 15 నుంచి రు. 20 ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేసేవార‌ట‌. అయితే అప్ప‌టికే త‌న‌కు ప్రియుడు ఉండ‌డంతో ఆమె ఆ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించింద‌ట‌.

 

అయితే ష‌కీలా వ్య‌క్తిగ‌త జీవితం అంతా విషాద‌మే. చాలా మందితో ప్రేమ వ్య‌వ‌హారాలు న‌డిపిన ఆమె ఎవ్వ‌రితోనూ ఆ బంధం ఎక్కువ రోజులు కంటిన్యూ చేయ‌లేదు. చాలా మంది చేతిలో ఆమె మోస‌పోయింది కూడా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: