‘సినిమాకు భాష లేదు.. భావమే ముఖ్యం. ఏ భాషలో తీసినా సినిమా ఒక్కటే..’ ఇదీ సినిమా వాళ్లు సినిమా గురించి చెప్పే మాట. ఇప్పుడీ మాటను పాటలకు కూడా వర్తించుకోవచ్చని రుజువు చేస్తోందో పాట. అదే.. బన్నీపూజా హెగ్డే లేటెస్ట్ సెన్షేషన్ ‘బుట్ట బొమ్మ’  రాష్ట్రాలు దేశాలు, ఖండాలు దాటి ఈ పాట దక్కించుకున్న ప్రజాదరణను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ పాటకు సౌత్ ఇండియా క్రేజీ సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కూడా ఈ పాటకు ఫిదా అయిపోయింది. తనలోని డాన్సింగ్ స్కిల్స్ ను ఈ పాటలో మరోసారి ప్రదర్శించింది.

 

 

బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా అంటూ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆ వీడియోను టిక్ టాక్ చేసింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సిమ్రన్ చాలా లయబద్దంగా స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసింది. ‘డ్యాన్స్ నన్ను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుతూ ముందుకు తీసుకెళ్తుంది.. నాలో ఉత్సాహం నింపుతుంది’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది. సిమ్రాన్ డ్యాన్సులకు అప్పట్లో ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. స్పీడ్ స్టెప్స్ ను కూడా చాలా వేగంగా వేసేది. చిరంజీవితో అన్నయ్య సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ లో సిమ్రన్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఆకట్టుకుంటాయి.

 

 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి దగ్గర నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ వరకూ బుట్టబొమ్మ పాట క్రియట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. పాటగా ఎంత హిట్టయిందో పాటలోని స్టెప్స్ అంత మ్యానియా క్రియేట్ చేసింది. సినిమాలో పాట చిత్రీకరించిన స్టైల్ కూడా అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్ వ్యూస్ పరంగా కూడా ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: