మన సంపద, మన కష్టం. మన ఉత్పత్తులు, మన మార్కెటింగ్, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు. జాతికి ఇచ్చిన పిలుపు. దాన్ని ఇపుడు అందరూ అందిపుచ్చుకుంటున్నారు. ఇక సినిమావారి సంగతికి వస్తే  మేము కూడా  స్వదేశీ అంటున్నారు. నో విదేశీ అని క్లారిటీగా చెప్పేస్తున్నారు.

 

ఓ విధంగా ఇది మంచి మార్పే. కరోనా మహమ్మారి ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఫారిన్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియాయే ఇపుడు సేఫెస్ట్ ప్లేస్ గా కనిపిస్తోంది. దాంతో సినిమా షూటింగులకు ఇక విమానాలు కట్టుకుని మరీ విదేశాల్లో వాలిపోయే సీన్ అసలు లేదని అంటున్నారు. విదేశాల్లో కంటే కూడా ఎక్కువ లోకేషన్లు ఇండియాలో ఉన్నాయని అంటున్నారు. ఆ మాటకు వస్తే గత రెండు దశాబ్దాలుగానే విదేశీ మోజు మన వారిలో పెరిగింది.

 

ఒక పాట షూట్ చేయలన్నా కూడా విదేశాలకు చెక్కేస్తున్నారు. దాని వల్ల లోకల్ గా సినీ కార్మికులకు పని లేకుండా పోతోంది. ఖర్చు కూడా తడిసిమోపెడు అవుతోంది. ఈ నేపధ్యంలో  కరోనా వచ్చి ఎవరు ఎక్కడుండాలో శాసించింది. దాంతో సినీజీవులు కూడా పూర్తిగా మారుతున్నారుట. ఇకపైన సినిమా షూటింగులు అన్నీ కూడా ఇండియాలోనే పెట్టుకుంటారుట.

 

భారీ బడ్జెట్ మూవీస్ కి అయితేనే రాష్ట్రం దాటుతారు, మిగిలిన సినిమాలకు సొంత రాష్ట్రాల్లోనే షూటింగ్ చేసుకుంటారు. ఈ రకమైన అదుపు, ఉదారత వచ్చిందంటే కచ్చితంగా కరోనా మహిమేనని చెప్పాలి.ఓ విధంగా ఈ పరిణామంతో లోకల్ సినీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు కూడా ఖర్చు తగ్గుతుందని వెల్ కం చెబుతున్నారు. మొత్తానికి ఒకపుడు భారతీయ సినిమా ఎలా ఉందో మళ్లీ అలా ఉండే పరిస్థితులే వచ్చాయి.

 

దీంతో మన కాశ్మీర్ అందాలు, మన కన్యాకుమారీ సోయగాలు, మన భారతీయ కల్చర్ అన్నీ కూడా ఈ తరానికి వెండి తెర మీద పరిచయం చేయవచ్చునని, ఇది సదవకాశమేనని ఫిల్మ్  మేకర్స్ కూడా అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: