మామూలుగా సినిమాలను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు థియేటర్లలో విడుదలైన తర్వాత దాదాపుగా ఒక నెల తర్వాత ఆన్లైన్లో స్ట్రీమ్  అవుతూ ఉంటుంది ఆ సినిమా. అయితే ప్రస్తుతం అన్ని సినిమాలు ఆన్ లైన్ లోనే విడుదల అవుతున్నాయి. ప్రముఖ ఆన్లైన్ స్విమ్మింగ్ కంపెనీలలో విడుదలవుతూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుకున్నాయి . దీనికి కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కరోనా  వైరస్ కారణంగా సినిమా షూటింగ్లు సినిమా థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే. 

 

 ఈ క్రమంలో ఇంకా ప్రారంభం కాని  సినిమాలకు లేదా ప్రారంభమై కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న  సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అన్ని పనులు పూర్తి చేసి  విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై  ఈ మహమ్మరి కరోనా  వైరస్ ప్రభావం కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో విడుదల ఆగిపోయింది. ఇక సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కనిపించడం లేదు దీంతో ఇప్పటికే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీ ద్వారా  విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఆన్లైన్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు సినీ ప్రముఖులు. 

 


 తాజాగా బాలీవుడ్ నుంచి ఇలాంటి అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది... బాలీవుడ్ సినిమాలు అంటే భారీ రేంజ్లో డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్లోనే మొదటి సినిమా డైరెక్టర్ ఓటిటి ద్వారా విడుదల చేయబోతున్నట్లు ప్రకటన తో బయటికి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యువహీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబోసిటాబో  అనే సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉండగా సినిమా థియేటర్లు మూసివేయడంతో దీన్ని విడుదల ఆగిపోయింది. ఇప్పట్లో  సినిమా విడుదలయ్యే అవకాశాలు కూడా లేకపోవడంతో జూన్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: