టాలీవుడ్ లో ద‌గ్గుపాటి వారి వంశాంకురం రానా ద‌గ్గుబాటి - మ‌హికా బ‌జాజ్ ప్రేమ వ్య‌వ‌హారం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. రానా ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎప్పుడూ అనేక కాంట్ర‌వ‌ర్సీల చుట్టూనే తిరుగు తూ ఉంటుంది. గ‌తంలో త్రిష తో ప్రేమ వ్య‌వ‌హారం అన్నారు. ఆ త‌ర్వాత క‌న్న‌డ హీరోయిన్ తో ఎఫైర్ ఉంద‌ని అన్నారు. ఇక రానా ఆరోగ్యంపై అనేక ర‌కాల వ‌దంతులు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు రానా - మిహీకా బ‌జాజ్ ప్రేమ వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు వీళ్ల కుటుంబ స‌భ్యుల‌కు కూడా వీళ్లు ప్రేమ‌లో ఉన్నార‌న్న విష‌యం తెలియ‌ద‌ట‌. 

 

ఇక మ‌హీకాకు బాలీవుడ్ తో చాలా లింకులు ఉన్నాయి. అయితే రానా మిహీకాతో ప్రేమ‌లో ఉన్నాడ‌న్న విష‌యం ఇరు కుటుంబాల‌కు ఇటీవ‌లే తెలిసింద‌ట‌. మిహీకా తల్లిదండ్రులు సురేష్ బజాజ్, బంటీ బజాజ్. ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ టోలూ బజాజ్ కూడా చెబుతున్నారు. ఇక మిహీకా ఎవ‌రో కాదు టోలూ బ‌జాజ్‌కు స్వ‌యానా మేన‌కోడులు అవుతుంది. వీరికి అనిల్ క‌పూర్‌, బోనీ క‌పూర్ కుటుంబాల‌తో కూడా స‌త్సంబంధాలు ఉన్నాయి. 

 

మిహీకా బాలీవుడ్ లో వ‌ర్క్ చేసిన‌ప్పుడు అనీల్ క‌పూర్ ఇంట్లోనే యేడాది పాటు ఉంది. అంతే కాదు సోన‌మ్ క‌పూర్‌, మిహీకా బెస్ట్ ఫ్రెండ్స్ అట‌. సోన‌మ్ రానా, మిహీకాకు మంచి కామ‌న్ ఫ్రెండ్ కూడాన‌ట‌. ఇక బాలీవుడ్ లో జ‌రిగిన ఓ పార్టీలోనే వీరిద్ద‌రు క‌లుసుకుని ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. దీనిని బ‌ట్టి మిహీకా ఉండేది హైద‌రాబాద్ లో అయినా వీరి ప్రేమ క‌థ అందా ముంబై నుంచే న‌డిచింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. వీరి ప్రేమ వ్య‌వ‌హారం సురేష్ బాబుకు ఈమధ్యే తెలిసిందట.  ఇక ఈ క‌రోనా లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే వీరు త్వ‌ర‌లోనే పెళ్లి పీఠ‌లు ఎక్క బోతున్నార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: