సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది లాక్ డౌన్ లో ఇంట్లో బోర్ గా ఫీలవుతున్నారు.. రకరకాల పనులు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ అలా కాదు. తనో కొత్త రూట్ ఎంచుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటున్నాడు. 

 

ప్రపంచంలో అందరికీ లాక్ డౌనే గానీ.. సల్మాన్ ఖాన్ కు మాత్రం కాదు. ఏడు వారాల నుంచి ఫామ్ హౌజ్ లోనే ఉంటున్నాడు. గేటు దాటలేదు. అయితేనేం.. గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ సల్మాన్ కు మాత్రమే వచ్చింది. షూటింగ్స్ లేవు.. హీరోయిన్ లేదన్న దిగులు లేదు. ఎంచక్కా లాక్ డౌన్ ను రొమాంటిక్ డౌన్ గా మార్చేశాడు. 

 

లాక్ డౌన్ కంటే ముందే థియేటర్స్ మూసేశారు. లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్.. చివరకు టీవీ సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆపేశారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. కానీ సల్మాన్ మాత్రం.. తనకు తానే మినహాయింపుగా తీసుకొని ఒకరిద్దరు అసిస్టెంట్స్ సహాయంతో.. తనలోని క్రియేటివిటీని బయటపెట్టాడు. ప్యార్ కరోనా.. తేరా బీనా పేరుతో రెండు వీడియో సాంగ్స్ షూట్ చేసి విడుదల చేశాడు. 

 

సల్మాన్ ఖాన్ అనుకోకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాడు. ఈలోగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఏడు వారాలుగా అక్కడే లాక్ అయిపోయారు. బోర్ కొట్టకుండా తనను తాను బిజీ చేసుకోవడానికి ఇలా పాటలు రూపొందించాడన్నాడు సల్మాన్. ఈ క్రమంలో ఈ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.

 

లాక్ డౌన్ టైమ్ లో రిలీజ్ చేసిన రెండు పాటలను సల్మానే పాడి.. షూట్ చేయడం విశేషం. ప్యార్ కరోనా సాంగ్ లో సోలోగా కనిపించిన సల్మాన్.. తేరే బినా పాటకొచ్చేసరికి ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ఆడిపాడాడు. లాక్ డౌన్ టైమ్ లో కూడా చాలా రొమాన్స్ చేసే అవకాశం సల్మాన్ కు మాత్రమే నచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఫామ్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత లాక్ డౌన్ అయితే అక్కడే ఉండిపోయారా.. లేదంటే..తన పాట కోసం జాక్వెలిన్ ను సల్మాన్ పిలిపించాడా.. అనే డౌట్  వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: