యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు 4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. నవరస కళాపోషణతో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు ఎన్టీఆర్. నూనూగు మీసాల వయసులోనే చెడుగుడు ఆడిన యంగ్ టైగర్  సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తనదని శైలిలో స్పందించే తారక్ ట్విట్టర్ లో అరుదైన రికార్డ్ సాధించాడు. 

 

తెలుగులో మిలియన్ ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా చేరాడు. అయితే ఎన్టీఆర్ ఈమధ్య 4 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పరచుకోగా తెలుగులోనే కాదు సౌత్ స్టార్స్ లో అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ లో ముందు ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్. ఏకంగా 9. మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ సత్తా చాటుతున్నాడు. ఇక ఆ 4 . మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. స్టార్స్ విషయానికి వస్తే ఈ ఫాలోవర్స్ తో కూడా రికార్డులు లెక్క కడతారు ఆ హీరోల ఫ్యాన్స్. 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ 4 మిలియన్ మైలురాయి చేరుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ కూడా అల్లూరిగా నటిస్తున్నాడు. ఈమధ్య వచ్చిన ఆలూరి టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ డైరక్ష లో మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమెత హిట్ కాగా రెండో ప్రయత్నంగా ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: