ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనం కపూర్ మే 8వ తేదీన 2018 సంవత్సరంలో బడా వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతనికి అతి పెద్ద బట్టల సంస్థ ఉండగా... ఆస్తి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అనిల్ కపూర్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ అత్యంత ధనికుల జాబితాలో ప్లేస్ సంపాదించుకున్నారు.



అనిల్ కపూర్ ఇప్పటివరకు వందల కోట్లను సంపాదించగా... తన కుమార్తె సోనం కపూర్ కూడా సినిమాల్లో నటిస్తూ 90 కోట్లకు పైగా సంపాదించిందట. అలాగే తన సొంత డబ్బులతో బీఎండబ్ల్యూ కారు కొనుక్కుంది. ఆనంద్ అహుజా సోనం కపూర్ కి 90 లక్షల రూపాయలతో డైమండ్స్ తొడిగిన వెడ్డింగ్ రింగ్ ఇచ్చారట. వీరి మ్యారేజ్ ఖర్చులు ఏకంగా రూ. 15 కోట్ల పైనే అయ్యుంటాయని సమాచారం.


ప్రస్తుతం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తన భర్తతో, అత్తమామలతో కలిసి ఢిల్లీలోని తన ఇంద్రభవనం లాంటి బంగ్లాలో సమయాన్ని గడుపుతుంది. లాక్ డౌన్ కారణంగా భార్యాభర్తలిద్దరూ ఇంటికే పరిమితం కావడంతో... తమ సమయాన్ని విలాసవంతమైన ఇంటిలో గొప్పగా గడుపుతున్నారు.


ఇటీవల సోనమ్ కపూర్ తన బంగ్లాకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐతే ఈ బంగ్లా ధర రూ. 173 కోట్లు ఉంటుందట. సోనమ్ క్వారంటైన్ స్నాప్ షాట్స్ అని ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ లో తన బెడ్ రూమ్, కిచెన్, రీడింగ్ రూమ్, గార్డెన్, కంప్యూటర్ రూమ్, చెప్పుల స్టాండ్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.

 

ఈ కళ్ళు చెదిరే అద్భుతమైన ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా సోనం కపూర్ మహారాణిలా తన జీవితాన్ని గడుపుతుందని చెప్పుకోవచ్చు. సోనం కపూర్ బంగ్లా కి సంబంధించిన ఫోటోలు చూడాలి అనుకున్నవారు ఇంస్టాగ్రామ్ వెబ్సైట్లోకి వెళ్లి సోనం కపూర్ అని ఇంగ్లీష్ లో సెర్చ్ చేసి వీక్షించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: