చిన్న చిన్న సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు ఉంటే ఆ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధిస్తాయి. అందుకే చిన్న చిన్న సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల పాత్రలు ఉండే విధంగా దర్శక నిర్మాతలు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నానీ సినిమా అయినా శర్వానంద్ సినిమా అయినా సరే ఇప్పుడు అగ్ర హీరోలు ఉండే విధంగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నానీ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి కి లేదా మహేష్ బాబు కి ఒక గెస్ట్ రోల్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్లాన్ అని అంటున్నారు. 

 

అదే విధంగా శర్వానంద్ సినిమాలో రామ్ చరణ్ కి ఒక మంచి పాత్ర ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ ని ఇప్పటికే ఒక పాత్ర కోసం శర్వానంద్ అడగగా రామ్ చరణ్ ఓకే చేసాడు అని అంటున్నారు. శర్వా కి మెగా కుటుంబానికి అతని చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఆ సినిమాలో అతన్ని అడిగినట్టు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న హీరోల సినిమాలకు కమర్షియల్ కోణం లో డిమాండ్ తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది టాలీవుడ్ జనం మాట. 

 

ఎందుకు అంటే లాక్ డౌన్ తర్వాత అన్నీ కూడా భారీ సినిమాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అందరూ చెప్తున్నారు. అందుకే చిన్న హీరోల సినిమాలను బ్రతికించాలి అని అంటే కచ్చితంగా స్టార్ హీరోలు ఉండాలి అని కొందరు అంటున్నారు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా చిన్న హీరోల సినిమాలను బ్రతికించడానికి తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. రామ్ చరణ్ ఎక్కువగా చిన్న హీరోలకు ప్రోత్సాహం అందిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: