టాలీవుడ్ లో రానా పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి గురించి ఎన్నో చర్చలు ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది పెళ్లి ఉంటుంది అని ఆయన తండ్రి సురేష్ బాబు చెప్పడం తో ఎప్పుడు రానా వివాహం చేసుకుంటాడు అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. రానా పెళ్లి విషయంలో ముందు నుంచి కూడా జనాలకు ఆసక్తి అనేది ఉంది. అతను పెళ్లి చేసుకునే దాని మీద చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతీ హీరో పెళ్ళికి చర్చలు జరిగాయి గాని ఇతని పెళ్ళికి మాత్రం కాస్త ఎక్కువగా జరిగాయి అనేది నిజం .

 

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రానా పెళ్లి గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అవి ఏంటీ అంటే... అతను లాక్ డౌన్ లో నే సైలెంట్ గా ఎవరిని పిలవకుండా వివాహం చేసుకుంటాడు అని అంటున్నారు. ఎవరిని పిలిచే అవకాశం లేదని కొందరి సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాన్ని కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితంగా ఉండే రాజకీయ నాయకులు ఒక మీడియా ప్రతినిధి కి ఫోన్ లు చేసి చెప్పి వాళ్ళను పిలిచి సైలెంట్ గా పెళ్లి చేస్తారని సమాచారం. ఈ పెళ్లి గురించి అంత హడావుడి అవసరం లేదు అనే భావన లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు. ఇక మిహీకా  బజాజ్ కుటుంబం కూడా ఇప్పుడు ఏ హడావుడి లేకుండా పెళ్లి చేసేద్దాం అని చెప్పిన  విధంగా వార్తలు వస్తున్నాయి. అందుకే సురేష్ బాబు ఈ ఏడాదే పెళ్లి ఉంటుంది అని చెప్పారని అంటున్నారు. మరి ఏ విధంగా పెళ్లి ఉంటుంది అనేది చూడాలి. ఎక్కడ చేస్తారు అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: