తెలుగులో ఓదశలో నెంబర్ వన్ హీరోయిన్ గా తన హవా చూపించిన భామ ఇలియానా. సౌత్ మొత్తం మీద కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా ‘ఇలియానా’నే. సాధారణంగా హీరోయిన్లు తెలుగు, తమిళ్ లో కలిపి క్రేజ్ తెచ్చుకుంటారు. రెమ్యునరేషన్, నెంబర్ వన్ పొజిషన్.. ఇవన్నీ మల్టీ లాంగ్వేజెస్ లో ఉండే క్రేజ్ ను బట్టి దక్కుతాయి. కానీ ఇలియానా కేవలం తెలుగు సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించింది. ఇంతటి స్టార్ స్టేటస్ ఉంచుకుని కూడా తెలుగు సినిమాలను దూరం చేసుకుంది.

 

 

కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఇలియానా తెలుగు సినిమాలు వదులుకుని బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ పెద్దగా రాణించలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ ఫిట్ నెస్ కూడా కోల్పోయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత తెలుగులో రవితేజతో సినిమా చేసింది. ఆ సినిమాలో తన మునుపటి చార్మ్ కోల్పోయి కనిపించింది. బొద్దుగా తయారైన ఇలియానా మళ్లీ తెలుగులో అవకాశాల కోసం పూర్వపు ఫిట్ నెస్ కోసం ట్రై చేస్తోంది అనే వార్తలు కూడా వచ్చాయి. వీటిని నిజం చేస్తూ అమ్మడు స్లిమ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నాజూకు నడుము అందం’గా పేరు తెచ్చుకున్న ఇలియానా ఈ ఫొటోల్లో తన ఒరిజినల్ ఫిగర్ సాధించినట్టే ఉంది.

IHG

 

తెలుగులో పలు అవకాశాలు ఇలియానాకు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. ఇవేమీ నిజం కాలేదు. కానీ.. తెలుగులో అవకాశాల కోసం ట్రై చేస్తోందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. పవన్ తో సినిమా అని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇలియానా మంచి ఫిట్ నెస్ సాధించినట్టే ఉంది. మరి ఈ ఫొటోలు చూసైనా ఇలియానాకు అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. ప్రస్తుతానికి బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: