టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ ఆన్న ఇమేజ్ ని దక్కించుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి ఫ్రాంఛైజీ తో దర్శక ధీరుడు అన్న గొప్ప క్రేజ్ ని సాధించాడు. ఈ సినిమా తెలుగు సినిమా ఘనత ని చాటి చెప్పింది. మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపింది. బాహుబలి సినిమా కి ముందు ఆ తర్వాత నా ఒక చరిత్రని క్రియోట్ చేశాడు రాజమౌళి. అప్పటి వరకు మన తెలుగు సినిమాకి 50 కోట్లు 60 కోట్లు అన్న బడ్జెట్ కేటాయిస్తే అదే భారీ బడ్జెట్ అని గొప్పగా చెపుకునే వాళ్ళు. కాని బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ అంటే కనీసాం 150 కోట్లు అన్నట్టుగా అయిపోయింది. అంతేకాదు రాజమౌళి మొదటి నుండి తన సినిమాలకి వస్తున్న క్రేజ్ మార్కెట్ అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. 

 

మొండి ధైర్యంతో రెండు భాగాలుగా తీసిన బాహుబలి సినిమా టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులకి, హీరోలకి, నిర్మాతలకి మన సినిమాని కూడా ఇలా తీయాలి.. అన్న ఆలోచనని కలుగజేసింది. అందుకే టాలీవుడ్ లో దర్శకులందరు రాజమౌళి వేసిన దారిలోనే వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్స్ సుజీత్ సాహో సినిమాతో సురేందెర్ రెడ్డి సైరా సినిమాతో భారీ బడ్జెట్ సినిమాలని తెరకెక్కించి శభాస్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే దారిలో మరికొంతమంది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వరసగా సక్సస్ లని అందుకున్న కొరటాల శివ మొదటి సారి పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. 

 

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా ఆచార్య అన్న టైటిల్ ని నిర్ణయించారు. ఇక లెక్కల మాస్టారు సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్దమయ్యాడు. అది కూడా ఏకకంగా 5 భాషల్లో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.  పుష్ప అన్ని టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇక మరోసారి ప్రభాస్ కూడా krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలోనే నటిస్తున్నాడు.

 

కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కే.జి.ఎఫ్ ఛాప్టర్ 2 ని పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందించాడు. ఇంకా మరికొంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాల రూపకల్పనలో రాజమౌళి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదే దారిలో వెళ్ళబోతున్నారు. మరి ఈ దర్శక ధీరుడి ని అందుకునేది ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: