ఇక కరోనా తో మనం కలిసి జీవించాల్సిందేనని అంతా ఫిక్స్ అయిపోయారో ఏమో కానీ మెల్లగా ఒక్కొక్క రవాణా వ్యవస్థ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరింపచేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కంటైన్మెంట్ మరియు బఫర్ జోన్ లలో మినహాయించి ఆంధ్ర ప్రదేశ్ లో మిగిలిన అన్నీ చోట్లా ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్నీ షాపులు తెరచుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి  రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా  పాక్షికంగా రైలు సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే బస్సు సర్వీసులు  కూడా ప్రారంభం కానున్నాయి.

 

మే 18 తారీఖు నుండి దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పునరుద్ధరించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. అయితే రైళ్లలో తీసుకున్నట్లుగానే బస్ లలో కూడా జాగ్రత్తలు తీసుకుని నడపాలని అధికారులు రెడీ అవ్వుతున్నారు. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు.

 

కాబట్టి.. బస్సుల్లోనూ సామాజిక దూరం తప్పనిసరి. క్రమంలో పరిమిత సంఖ్యలోనే బస్సుల్లోకి ప్రయాణీకులను అనుమతిస్తారు. అంతే కాదు సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్ల సంఖ్య కుదించారు.  మొత్తం 36 సీట్లు ఉన్న బస్సుల్లో సీట్ల సంఖ్యను 26కు పరిమితం చేశారు.

 

ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర హైఎండ్‌ సర్వీసుల్లో 50 శాతం మందినే అనుమతించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాట్లు సమాచారం. ఇక చార్జీల పెంపు విషయంలో ఎవరూ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. కావున మామూలు చార్జీలు వసూళ్ళు చేస్తూనే బస్సులు నడిచే అవకాశాలు ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: