టాలీవుడ్ సెలబ్రిటీలు రియల్ లైఫ్ పార్ట్ నర్స్ లను కూడా అదే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వారిలో చాలామంది ఉండగా హీరో గోపీచంద్ కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయినే పెళ్లాడాడు. గోపీచంద్ వైఫ్ పేరు రేష్మ ఆమె ఎవరో కాదు స్వయానా హీరో శ్రీకాంత్ మేనకోడలు. గోపీచంద్ మంచితనం తెలిసి శ్రీకాంత్ రేష్మని ఇచ్చి పెళ్లి చేశాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పిస్తున్న గోపీచంద్ కెరియర్ లో ప్రస్తుతం వెనుక పడ్డా ఏదో ఒకరోజు మళ్ళీ తన మార్క్ హిట్ కొడతాడని చెప్పొచ్చు. 

 

గోపీచంద్ హీరోయిన్ అనుష్కని పెళ్ళాడతాడని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. గోపీచంద్ తో అనుష్క నటించిన సినిమాల్లో వీరి రొమాన్స్ పీక్స్ లో ఉండేది.అందుకే జోడీ బాగుందని వార్తలు బాగా రాశారు. అయితే సడెన్ గా గోపీచంద్ రేష్మని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. గోపీచంద్ రేష్మలకు ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత హీరోలకి బాగా కలిసి వస్తుంది.. కానీ గోపీచంద్ కు మాత్రం ఇంకా ఆ లక్ తగలట్లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

 

ఈమధ్య అతను చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకే కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా సిటీమార్ సినిమా వస్తోంది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోందని తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు గోపీచంద్. మరి సీటిమార్ తో అయినా గోపిచంద్ కోరుకునే సూపర్ హిట్ వస్తోందో లేదో చూడాలి. సంపత్ నంది తన టాలెంట్ అంతా పెట్టి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: