టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఆమె సినిమాలు అనగానే ప్రేక్షకులలో నరసింహ వద్ద నుంచి ఒక క్రేజ్ ఉండేది. ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి పాత్రలు వచ్చాయి. బాహుబలి సినిమాతో కూడా రమ్యకృష్ణ తనలో సత్తా చాటారు. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి దేవిగా ఆమె న‌ట‌న న‌భూతోః న‌భ‌విష్య‌త్ అన్న‌ట్టుగా ఉంది. బాహుబ‌లి సినిమాతో ర‌మ్య‌కృష్ణ నేష‌న‌ల్ స్టార్ కాదు ఏకంగా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయింది. ఇక ఇటీవల ఆమెకు తెలుగులో కీలక పాత్రలు వస్తున్నాయి. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ఆమెను మంచి పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. 

 

ఇక వెండి తెర‌తో పాటు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ల‌లో కూడా న‌టిస్తోంది. ఆమె న‌టిస్తోన్న వెబ్ సీరిస్‌ల‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. ప్ర‌స్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో రమ్యకృష్ణ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక దర్శకుడు ఆమె విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించాడు అని టాక్. టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు రమ్యకృష్ణతో కాస్త దురుసుగా ప్రవర్తించినట్టు ఇండ‌స్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక సన్నివేశంలో ఆమె కాస్త పైన టాప్ కాస్త జారిపోయి నటించాలి. నడుం వరకు చీర కొంగు ఉండదు. ఆ సీన్ చేసేలా అయితేనే సినిమా ఒప్పుకోవాలి అన్నాడట. 

 

అంతే ఆ ఒక్క మాటతో రమ్యకు ఒళ్ళు మండి దిక్కు లేక సినిమాలు చేయడం లేదు ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకుంటే అందరికి మంచిది అని ఆమె వార్నింగ్ ఇచ్చారట. నిర్మాతతో కూడా ఆమె గట్టిగానే చెప్పినట్టు సమాచారం. తాను అవసరం కోసం సినిమా చేయడం లేదని ఆమెకు చెప్పారట. దీనితో రమ్యకృష్ణ ను బుజ్జగించే ప్రయత్నం చేయగా ఈ విషయం కృష్ణ వంశీ వరకు వెళ్ళింది అంటున్నారు. చివ‌ర‌కు ఏదోలా ఇది స‌ద్దుమ‌ణిగేలా చేశార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: