టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో నానీ. అతని సినిమాలు అనగానే ముందు నుంచి ప్రేక్షకులకు ఒక ఆసక్తి. సినిమా కోసం చాలా కష్టపడి నటిస్తాడు అని అతనిలో కష్టపడే గుణం ఉందని పలువురు సినీ ప్రముఖులు అంటూ ఉంటారు. ఎలాంటి పాత్ర‌లో అయిన అత్యంత స‌హ‌జ‌త్వంతో ఇమిడి పోవ‌డం నాని స్టైల్‌. నాని కి అటు క్లాస్‌తో పాటు ఇటు మాస్‌లోనూ నానికి మంచి పేరు వ‌చ్చింది. 2014- 2016 టైంలో అయితే నానికి ఏకంగా ఏడెనిమిది వ‌రుస హిట్లు ప‌డ్డాయి. నాని సినిమా వ‌స్తుందంటే చాలు సూప‌ర్ డూప‌ర్‌హిట్టే. ఇక నానీ సినిమాలు అనగానే చాలా మంది దర్శక నిర్మాతలు కూడా అతని సినిమా మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. 

 

ఇక నానీ దాన్ని చూసుకుని కొన్ని రోజులు ఎవరికి అందని ఎత్తులో నుంచున్నాడు. ఏ దర్శకుడు అడిగినా ఏ నిర్మాత అడిగినా సరే తాను చేసేది లేదు లేదా పారితోషికం ఎక్కువగా అడగడం వంటివి చేసాడ‌న్న రూమ‌ర్ అప్పట్లో బాగా స్ప్రెడ్ అయ్యింది. అతెందుకు ఓ హీరోయిన్ తో కూడా నాని గొడ‌వ జ‌ర‌గ‌డం... వారిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డ‌వ‌డంతో చివ‌ర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు జోక్యం చేసుకుంటే కాని ఇది స‌మ‌సిపోలేదు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌రో స్టార్ నిర్మాత‌తోనూ గొడ‌వ జ‌రిగింద‌న్న ప్ర‌చారం ఉంది. 

 

ఇప్పుడు అతన్ని చాలా మంది పక్కన పెట్టేసారు అనే టాక్ వినపడుతుంది. దీనితో నానీ తన ఇగో ని తగ్గించుకుని సినిమాలు చెయ్యాలి అని ఇండ‌స్ట్రీలో ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మధ్య నానీ కి ఒక దర్శకుడు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ వార్నింగ్ త‌ర్వాత‌ నుంచి మాత్రం నానీ లో మాత్రం మార్పు వచ్చింది అని ప్రచారం జరుగుతోంది. నానీ ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో వీ ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: