మలయాళంలో హిట్ ఆయిన్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారన్న వార్తలు ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా రీమేక్ అవుతుందని టాక్. మలయాళంలో సినిమా రిలీజై హిట్ టాక్ రాగానే పీపుల్స్ మీడియా వారు రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో సినిమా చూశారు. వెంకటేష్, పవన్ లతో సినిమా చేయాలని అనుకోగా వాళ్ళిద్దరికీ ఈ సినిమా సూట్ అవదని వదిలేశారు. 


రామ్ చరణ్ కూడా ఆ సినిమా చూసి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదా. ఇక బెల్లంకొండ సురేష్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చూసి రీమేక్ హక్కులను 50 లక్షలకు అడిగితే మళయాళ నిర్మాత ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారట. సో అలా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చర్చల్లో నిలిచింది. అయితే అసలు పవన్ కళ్యాణ్సినిమా చూశాడా చూస్తే తనకు ఆ సినిమా సూట్ అవుతుందని భావిస్తున్నాడా.. అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవేళ పవన్ తనకు నచ్చి సినిమా చేస్తానని అంటే మాత్రం రీమేక్ ఫిక్స్ అయినట్టే. 


ప్రస్తుతం పవన్ క్యూ లైన్ లో చాల సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రీమేక్ తీసే ఆలోచనా ఉన్న అది ఇప్పడప్పుడే అయ్యే పని కాదు. పృథ్వి రాజ్, సూరజ్ నటించిన ఈ సినిమాను లాల్ జూనియర్ డైరెక్ట్ చేశారు. పాయింట్ చిన్నదే అయితే దాన్ని తెలుగులో తీసే సాహసం ఎవరు చేస్తారో చూడాలి. మొన్నామధ్య మెగా హీరో సాయి తేజ్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ బాగా నచ్చిదని ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో చెప్పాడు. మొత్తానికి మలయాళ సినిమాలపై తెలుగు దర్శక నిర్మాతల కన్ను బాగా ఉంది. ఇదే కాకుండా పృథ్వి రాజ్ నటించిన అయ్యప్పనం కోషియం సినిమాను కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: