ఆర్‌. నారాయణ మూర్తి కేవలం హీరో గానే కాదు రచయిత గా, డైరెక్టర్‌, సింగర్ ‌గా, మ్యూజిక్ డైరెక్టర్ ‌గా, నిర్మాత గా తెలుగు సినిమా పరిశ్రమకు అనేక విభాగాల్లో తన ముద్ర వేశారు. ముఖ్యంగా స్నేహ చిత్ర పిక్చర్స్‌ అనే సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలను, ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో అన్నదే ఆయన సినిమాలకు మూల కథాంశం గా తెరకెక్కుతున్నాయి.

 

నిరుద్యోగం, వరల్డ్ బ్యాంక్‌ పాలసీలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, ఎన్విరాన్మెంటల్‌ ఇష్యూస్‌, పునరావాస సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ కుతంత్రాలు లాంటి కాంటెంపరరీ సోషల్ ఇష్యూసే ప్రధాన అంశాలుగా ఈయన సినిమాలు తెరకెక్కుతాయి. అర్ధరాత్రి స్వతంత్య్రం, అడవి దివిటీలు, లాల్‌ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు లాంటి ఎన్నో సినిమాలను ఆయన రూపొందించారు. ఒక సమయంలో ఆయన సినిమాలో బ్లాక్‌ బస్టర్ విజయాలు సాధించి కాసుల పంట పండించేవి. స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నారాయణ మూర్తి.

 

అయితే ఇన్ని విజయాలు సాదించిన ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు. తన చేస్తున్న కార్యక్రమాలను ఎక్కడైనా తన జీవిత భాగస్వామి వ్యతిరేకిస్తుందేమో అన్న అనుమానం తో నారాయణ మూర్తి చాలా కాలం వివాహం చేసుకోలేదట. సినిమాలో ఓ స్థాయిలో సెటిల్ అయిన తరువాత ఆ ఆలోచన వచ్చిన అప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది దీంతో ఆయన ఒంటరిగానే మిగిలిపోయారు. తాను వివాహం చేసుకోనందుకు ఎంతో బాధపడుతునాన్నని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి. తరుచూ ఒంటరితనం ఇబ్బంది పెడుతుందని, ఇంకా సెటిల్‌ అవలేదన్న ఆలోచన మాని చక్కగా పెళ్లి చేసుకోండని యువతీ యువకులకు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: