మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా చెప్పవచ్చు. చిత్రపరిశ్రమకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ అభిమానగణాన్ని సంపాదించుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమని కొన్నేళ్ళపాటు ఏలిన హీరో చిరంజివి.  అందుకే సినిమా ఇండస్ట్రీకి వచ్చే నూతన నటీనటులు చిరంజీవినే స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇప్పటికి కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

 

ప్రస్తుత జనరేషన్ నటీనటులు కూడా చిరజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. పెళ్ళి చూపులు సినిమాతో కమెడియన్ గా పరిచయమై మల్లేశం సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్న ప్రియదర్శికి కూడా చిరంజీవే ఇన్స్పిరేషన్. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో జనాలు ఓటీటీల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ కమెడియన్ లూసర్ అనే వెబ్ సిరీస్ ని విడుదల చేశాడు.

 

ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి షూటర్ గా కనిపించాడు. ఒలింపిక్స్ కి వెళ్లాలనుకునే షూటర్ పేదరికం కారణంగా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. వాటిని ఎలా పరిష్కరించుకుని తన గమ్యాన్ని చేరుకున్నాడనేదే కథ. ఓటీటీలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ సినిమాలో ఒకానొక చోట కృషితో నాస్త్ దుర్భిక్షం అనే మాట కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇదే మాటమీద తెరకెక్కింది.

 

ఈ విషయాన్ని షేర్ చేసిన ప్రియదర్శి, ఇది పోలిక కానే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తి పొందాను. నటనలో మీరు ఆవిష్కరించిన కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావం చూపాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ లూసర్ చిత్రం మీకు అంకితం అని చెప్పాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: